ETV Bharat / bharat

అధికారికి తేజస్వీ ఫోన్​.. వీడియో వైరల్​ - tejaswi yadav phone call to dm

బిహార్​ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్​ ఓ ఉన్నతాధికారికి చేసిన ఫోన్​ కాల్​ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పట్నాలో ఔత్సాహిక ఉపాధ్యాయులు పలు డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసనకు దిగారు. వారికి మద్దతుగా ఘటనాస్థలికి చేరుకున్న తేజస్వీ.. జిల్లా పాలనాధికారికి ఫోన్​ చేసి మాట్లాడారు. సమస్యపై ఆయన స్పందించిన విధానం.. అధికారులతో మాట్లాడిన తీరు నిరసనకారులను ఆకట్టుకుంది.

dm saab this is tejashwi yadav speaking phone call video goes viral
తేజస్వి యాదవ్​ ఫోన్‌కాల్‌ వీడియో వైరల్‌!
author img

By

Published : Jan 21, 2021, 7:47 PM IST

Updated : Jan 21, 2021, 8:22 PM IST

ఆర్జేడీ నేత, బిహార్‌ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ ఓ ఉన్నతాధికారికి ఫోన్‌లో షాక్‌ ఇచ్చారు. పట్నాలో ఔత్సాహిక ఉపాధ్యాయులు తమ డిమాండ్లపై తలపెట్టిన నిరసనకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం కారణంగా ఆయనే స్వయంగా జిల్లా మెజిస్ట్రేట్‌ చంద్రశేఖర్‌ సింగ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ఔత్సాహిక ఉపాధ్యాయులు తమ సమస్యలపై పట్నాలోని ఎకో పార్కు వద్ద ధర్నాకు దిగారు. దీంతో వారికి మద్దతు తెలిపేందుకు తేజస్వి యాదవ్‌ అక్కడికి వెళ్లగా.. ధర్నాకు అధికారులు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. దీంతో అక్కడి నుంచే నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పట్నా జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫోన్‌ చేసి వారి ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరారు.

ఈ క్రమంలోనే పట్నా డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ (డీఎం)తో మాట్లాడుతూ.. ధర్నాలో కూర్చొనేందుకు అనుమతివ్వడంలేదని యువకులు చెబుతున్నారు. ఎందుకు? అని తేజస్వి ప్రశ్నించారు. ప్రతిరోజూ అనుమతి తీసుకోవాలా? పోలీసులు లాఠీఛార్జి చేశారు, వారు తీసుకొచ్చిన ఆహారాన్ని విసిరేశారు. ఆందోళనకారులను చెదరగొట్టారు.. అంటూ అక్కడి పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారిలో ఇంకొందరు ఎకో పార్కు వద్ద తనతోనే ఉన్నారని తేజస్వి వివరించారు. వారి దరఖాస్తును తాను వాట్సాప్‌లో పంపిస్తానని, ధర్నా చేసుకోనివ్వాలని ఆయన కోరారు.

దీనికి స్పందించిన సింగ్‌.. దరఖాస్తు పంపిస్తే పరిశీలిస్తానంటూ సమాధానమిచ్చారు. ఎప్పుడు అనుమతిస్తారు? అని తేజస్వి అడగ్గా.. నన్ను మీరు ప్రశ్నిస్తారా? అంటూ సింగ్‌ గట్టిగా స్పందించారు. దీంతో 'డీఎం సాబ్‌.. నేను తేజస్వి యాదవ్‌ని మాట్లాడుతున్నా..' అని చెప్పారు. దీంతో అప్రమత్తమైన ఆ ఉన్నతాధికారి తన గొంతును సవరించుకొని 'ఓకే.. సర్‌..సర్‌..సర్'‌ అన్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న నిరసనకారులంతా ఒక్కసారిగా నవ్వారు. అనంతరం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. దరఖాస్తును వాట్సాప్‌లో పంపిస్తా. త్వరగా స్పందించండి. లేకపోతే రాత్రంతా ఇక్కడే కూర్చుంటాం అని చెప్పి తన కాల్‌ను పూర్తి చేశారు. డీఎం, తేజస్వి మధ్య జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇదీ చూడండి: తేజస్వీ సహా 18 మందిపై కేసు నమోదు

Last Updated : Jan 21, 2021, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.