దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పార్లమెంటు సౌధం విద్యుత్ దీపాల్లో వెలుగులీనింది. హస్తినలోని అక్షర్ ధామ్ ఆలయం దీపకాంతుల్లో మెరిసింది. దిల్లీ సీఎం కేజ్రివాల్, ఉపముఖ్యమంత్రి సిసోడియా దంపతులు.. దీపావళి సందర్భంగా దిల్లీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని విద్యుత్, సంప్రదాయ దీపాలతో అలంకరించారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు.
అయోధ్యలోని సరయూ ఘాట్‌లో నదికి హారతి ఇచ్చారు. కోల్‌కతాలోని కాళీమాత ఆలయాన్ని సంప్రదాయ దీపాలతో అలకరించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని సిలిగుడిలో ఇరుదేశాల మధ్య ఉన్న కంచెపై జవాన్లు దీపాలు వెలిగించారు. ఉత్తరాఖండ్‌లోని ఇండో-టిబెటన్ సరిహద్దుల్లో సైనికులు.. కాగడాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.
ఛత్తీస్‌గడ్‌లోని రాజ్‌నందగావ్‌లో ఐటీబీపీ జవాన్లు దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా చిన్నారులు, పెద్దలు బాణసంచా కాల్చడంలో నిమగ్నమయ్యారు.
ఇవీ చదవండి: