ETV Bharat / bharat

ప్రణాళిక ప్రకారం భారత్​- చైనా బలగాల ఉపసంహరణ - ఈటీవీ భారత్​

భారత్​-చైనా మధ్య తుర్పు లద్దాఖ్​ పాంగాంగ్​ సరస్సు ప్రాంతంలో బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రణాళికపరంగా సాగుతోందని తెలుస్తోంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలోని కమాండర్లు రోజూ సమావేశమవుతున్నట్టు సమాచారం. మరో 6-7 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిగా ముగిసే అవకాశమున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Disengagement process going on in Pangong Tso areas as per plan: Sources
ప్రణాళిక పరంగా సాగుతున్న బలగాల ఉపసంహరణ
author img

By

Published : Feb 16, 2021, 9:33 AM IST

Updated : Feb 16, 2021, 1:31 PM IST

తూర్పు లద్దాఖ్​లోని పాంగాంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాల్లో భారత్​-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రణాళికపరంగా సాగుతోందని సైనిక వర్గాలు వెల్లడించాయి. మరో 6-7 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగుస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నాయి.

పాంగాంగ్​ సరస్సు ఉత్తర ప్రాంతం నుంచి పీఎల్​ఏ(చైనా లిబరేషన్​ ఆర్మీ) ఇప్పటికే.. బంకర్లు, తాత్కాలిక పోస్టులు, ఇతర నిర్మాణాలను తొలగించిందని.. సైనిక బలగాన్ని కూడా నెమ్మదిగా తగ్గించుకుంటోందని సైనిక వర్గాలు స్పష్టం చేశాయి.

Disengagement process going on in Pangong Tso areas as per plan: Sources
పాంగాంగ్​ సరస్సులో బలగాల ఉపసంహరణ

పాంగాంగ్​ వద్ద సైనికులు

బలగాల ఉపసంహరణ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు క్షేత్రస్థాయిలోని కమాండర్లు రోజువారీగా సమావేశమవుతున్నారని అధికారులు వెల్లడించారు.

చైనా దూకుడుతో గతేడాది మే నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. జూన్​లో గల్వాన్​ లోయలో భారత్​-చైనా సైనికుల మధ్య భారీ స్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పరిస్థితులను సరిచేసేందుకు ఇరు దేశాల అధికారులు అప్పటి నుంచి చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇరు దేశాలు పాంగాంగ్​ సరస్సులో బలగాల ఉపసంహరణ ప్రక్రియను మొదలుపెట్టినట్టు గత గురువారం పార్లమెంట్​ వేదికగా రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ప్రకటించారు.

ఇదీ చూడండి:- బలగాల ఉపసంహరణ: చైనా ఉచ్చులో భారత్?

Last Updated : Feb 16, 2021, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.