పాంగాంగ్ సరస్సు దక్షిణ, ఉత్తర సరస్సులో బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైంది. భారత దళాలు తమ స్థావరాలకు చేరుకున్నాయి. ఈ మేరకు భారత సైనిక వర్గాలు శుక్రవారం తెలిపాయి.
మరోసారి సమావేశం..
భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద చెలరేగిన వివాదాలను పరిష్కరించుకొనేందుకు మరోసారి సమావేశం కానున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు చైనా భూభాగంలోని మాల్దో పోస్టు వద్ద ఈ సమావేశం జరగనుంది.
శనివారం జరగనున్న కమాండర్ స్థాయి సమావేశంలో తూర్పు లద్దాఖ్‌లోని గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్, దెప్సాంగ్ ప్రాంతాల్లో సైనిక బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు ప్రధానంగా చర్చించనున్నాయి. ఈ మేరకు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.
పాంగాంగ్ ఉత్తర, దక్షిణ తీరాల్లో పూర్తైన బలగాల ఉపసంహరణ ప్రక్రియను సమీక్షించడంతో పాటు మిగిలిన ప్రదేశాల్లో వివాదాలపై కూడా చర్చించనున్నారు.