Didwana Road Accident : రాజస్థాన్.. డీడ్వానా జిల్లాలో ప్రైవేటు బస్సు, కారు ఢీకొని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాదీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగౌర్‌లోని జరిగిన ఓ ఊరేగింపులో పాల్గొన్న ఏడుగురు.. కారులో సికర్‌కు తిరిగి వెళ్తున్నారు. బంతడి గ్రామంలోని టిట్రి కూడలి వద్ద కారు.. ఓ బస్సు ఢీకొన్నాయి. దీంతో కారులోని ఏడుగురు అక్కడికక్కడే ప్రణాలు కోల్పోయారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్రం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక మృదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని దిద్వాన ఎమ్మెల్యే చేతన దుది, కలెక్టర్ సితారాం జట్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. అయితే, బస్సును ఢీకొన్న తర్వాత కారు రెండు 3-4 సార్లు పల్టీలు కొట్టి.. 20 అడుగుల దూరంలో పడిందని.. రెండు ముక్కలైందని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.
కుంగిపోయిన రోడ్డులోకి బస్సు..
Himachal Pradesh Road Accident : హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం తప్పింది. మండి- శిమ్లా జాతీయరహదారిలో కొంత భాగం రోడ్డు కుంగిపోవడం వల్ల ఓ ఆర్టీసీ బస్సు.. అందులో దిగిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున మండి జిల్లాలోని కాంగో ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ట్రక్కు బోల్తాపడి జవాన్ మృతి
Rajasthan Truck Accident : రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో బీఎస్‌ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు బోల్తా పడిన ఘటనలో ఓ జవాన్ మృతి చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. జిల్లాలోని షాఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని జైసల్మేర్‌కు తరలించామని.. అక్కడ వారు జవహర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబీకులకు సమాచారం అందించామని, వారు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలిపారు.