ETV Bharat / bharat

''మేనల్లుడి కప్పం' వసూలు చేస్తోన్న మమత'

'నందిగ్రామ్​లో మమతా బెనర్జీ ఆగ్రహావేశాలు ప్రదర్శించినప్పుడే.. ఆమె ఓడిపోతారని దేశం మొత్తానికి తెలిసింది' అని ప్రధాని మోదీ అన్నారు. మేనల్లుడి కోసం ఆమె అవినీతి పాల్పడుతున్నారని ఆరోపించారు.

MODI
ప్రధాని మోదీ
author img

By

Published : Apr 6, 2021, 2:03 PM IST

Updated : Apr 6, 2021, 2:11 PM IST

బంగాల్​ ప్రజల నుంచి ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 'మేనల్లుడి కప్పం'(బైపో సర్వీస్​ ట్యాక్స్​) వసూలు చేస్తున్నారని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.

'నందిగ్రామ్​లో మమత కోపాన్ని ప్రదర్శించినప్పుడే ఆమె ఓడిపోతారని దేశం మొత్తం గ్రహించింది' అని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'బంగాల్​లో గెలుస్తామని చెబుతున్నారు.. మోదీ ఏమన్నా దేవుడా?' అన్న మమత వ్యాఖ్యలపైనా స్పందించారు. 'మేము దేవుళ్లం కాము. కేవలం సాధారణ మనుషులం.. ప్రజలకు సేవచేసుకునే సాధారణ మనుషులం' అని దీదీకి.. మోదీ కౌంటర్​ ఇచ్చారు. బంగాల్​లోని కూచ్​ బిహార్​లో బహిరంగ సభలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు బొట్టు పెట్టుకోవడాన్ని, కాషాయ వస్త్రాలు ధరించడాన్ని మమత సహించలేకపోతున్నారని విమర్శించారు మోదీ. తనకు మద్దతుగా నిలవాలని మైనార్టీలను మమత పదేపదే అడగడం.. ఆ వర్గం ఓట్లు ఆమె చేజారిపోతున్నాయనేందుకు నిదర్శనమని చెప్పారు.

ఇదీ చదవండి: 'దుష్ప్రచారంతో రాజకీయ అస్థిరతకు కుట్ర!'

Last Updated : Apr 6, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.