ETV Bharat / bharat

26వేల వజ్రాలతో ఉంగరం తయారీ.. అందుకోసమేనట!

ప్రపంచంలోనే ఎక్కువ వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారు చేసింది ఉత్తర్​ప్రదేశ్​లో ఓ జ్యువెలరీ సంస్థ. ఈ రింగ్ తయారీ కోసం 26,200 వజ్రాలను వాడింది.

diamond studded ring
డైమండ్ రింగ్
author img

By

Published : Jan 10, 2023, 4:10 PM IST

Updated : Jan 10, 2023, 4:32 PM IST

26వేల వజ్రాలతో ఉంగరం తయారీ.. అందుకోసమేనట!

ప్రపంచంలోనే ఎక్కువ వజ్రాలు పొదిగిన​ రింగ్​ను తయారు చేసింది ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​కు చెందిన ఓ జ్యువెలరీ సంస్థ. ఈ ప్రత్యేక ఉంగరం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ డైమండ్ తయారీకి ఎన్ని రోజుల పట్టిందో? ప్రత్యేకతలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
మేరఠ్​లోని డాజ్లింగ్ జ్యువెలరీ అనే ఆభరణాల తయారీ సంస్థ 26,200 వజ్రాలను ఉపయోగించి ఈ రింగ్​ను డిజైన్ చేసింది. ఈ ఉంగరానికి దేవ్ ముద్రిక అని పేరు పెట్టారు సంస్థ యజమాని విపుల్ అగర్వాల్. అంతకుముందు దక్షిణాదికి చెందిన ఓ సంస్థ 24 వేలు వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారు చేసిందని విపుల్ తెలిపారు. ఆ కంపెనీ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొడతామని ఆయన చెప్పారు. మొదట ఉంగరం డిజైన్​ను సాఫ్ట్​వేర్​ ద్వారా రూపొందించి.. అనంతరం కళాకారులతో రింగ్​ను తయారు చేయించినట్లు విపుల్​ వివరించారు.

diamond studded ring
డైమండ్ రింగ్

"డైమండ్ రింగ్​ను ఫ్లవర్ ఆకారంలో తయారు చేశాం. ఈ ఉంగరాన్ని రెండు వేళ్లకు పెట్టుకోవచ్చు. దీని తయారీ కోసం 26,200 డైమండ్లను ఉపయోగించాం. ఇందుకోసం 8 నుంచి 10 మంది కళాకారులు మూడు నెలలపాటు కష్టపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా ఒక ఉంగరం తయారీకి ఇన్ని ఉంగరాలు వాడలేదు. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్​ రికార్డ్స్​లో చోటు కోసం దరఖాస్తు చేశాం. ప్రస్తుతానికి ఉంగరం ధరను గోప్యంగా ఉంచుతున్నాం. గిన్నిస్ బుక్​లో చోటు సంపాదించగానే ధర నిర్ణయిస్తాం."

-- విపుల్ అగర్వాల్​, డాజ్లింగ్ జ్యువెలరీ యజమాని

diamond studded ring
డైమండ్ రింగ్
diamond studded ring
26,200 వజ్రాలతో పొదిగిన ఉంగరం
ఇదీ చదవండి:

Last Updated : Jan 10, 2023, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.