Dggi raids on kanpur businessman: ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో అక్రమంగా నగదు కూడబెట్టిన మరో వ్యాపారి గుట్టు రట్టయింది. జీఎస్టీ ఎగవేత కేసులో... మయూర్ వనస్పతి సంస్థ యజమాని సునీల్ గుప్తాకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ బృందం మంగళవారం రాత్రి దాడులు నిర్వహించింది. ఆ వ్యాపారి రూ.10 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను మోసపూరితంగా క్లెయిమ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
Mayur vanspathi: మయూర్ వనస్పతి సంస్థకు చెందిన వారి ఇళ్లు, కార్యాలయాలపై తాము దాడులు నిర్వహించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు తెలిపారు. అయితే.. పన్నులు చెల్లించేందుకు సునీల్ గుప్తా అంగీకరించారని చెప్పారు. ఈ దాడుల్లో తాము కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
ఈ కేసులో సునీల్ గుప్తాను అధికారులు అరెస్టు చేయలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని వారు చెప్పారు.
Piyush jain news: మరోవైపు... కాన్పుర్ వ్యాపారి పీయూష్ జైన్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో డీజీజీఐ అధికారులు బుధవారంతో సోదాలు ముగించారు. మొత్తం రూ.194.45 కోట్ల నగదు, 23 కిలోల బంగారం, 600 కిలోల చందనం నూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పీయూష్ జైన్‌కు కాన్పుర్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఇదీ చూడండి: 'డొక్కు స్కూటర్, రబ్బరు చెప్పులతో తిరిగి రూ.వందల కోట్లు దాచాడా?'
ఇదీ చదవండి: బ్యాంకు మాజీ ఛైర్మన్‌పై ఈడీ కొరడా.. రూ.294కోట్ల ఆస్తులు జప్తు