ETV Bharat / bharat

శిర్డీ సాయినాథుడికి భారీ కానుక - భర్త కల నెరవేర్చిన భార్య, పిల్లలు - షిర్డీలో పాఠశాల ప్రారంభించాలనే జయప్రకాశ్ కల

Devotee Donates One Crore Rupees House to Shirdi Sai: శిర్డీ సాయిబాబాకు ఓ కుటుంబం కోటి రూపాయలు విలువైన భవనాన్ని కానుకగా సమర్పించింది. దీంతో తన భర్త కలను నెరవేరిందంటున్నారు బెంగళూరుకు చెందిన భక్తురాలు.

Devotee_Donates_One_Crore_Rupees_House_to_Shirdi_Sai

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 4:48 PM IST

Updated : Nov 29, 2023, 6:07 PM IST

శిర్డీ సాయినాథుడికి భారీ కానుక - భర్త కల నెరవేర్చిన భార్య, పిల్లలు

Devotee Donates One Crore Rupees House to Shirdi Sai: 'సబ్​ కా మాలిక్ ఏక్​ హై' అనే మహా సందేశాన్ని ప్రసాదించిన శిర్డీ సాయినాథుడికి భక్తులు స్వచ్ఛందంగా బంగారం, వెండి, నగదును విరాళంగా ఇవ్వటం మనం చూశాం. అయితే ఓ కుటుంబం మాత్రం తన రెండంతస్తుల భవనాన్ని బాబాకు కానుకగా ఇచ్చింది. కోటి రూపాయలు విలువ కలిగిన భవనాన్ని సాయినాథుడికి విరాళంగా ఇవ్వటంతో తన భర్త కల నెరవేరిందంటున్నారో భక్తురాలు.

వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరుకు చెందిన జయప్రకాశ్ మాకం సాయిబాబా భక్తుడు. బాబాపై ఆయనకున్న ప్రగాఢ విశ్వాసం కారణంగా నెలకు రెండుసార్లు బెంగుళూరు నుంచి సాయిబాబా దర్శనం కోసం శిర్డీకి వచ్చేవారు. ప్రతినెలా సాయినాథుడి దర్శనం కోసం వచ్చి.. వెళ్తుండటం జయప్రకాశ్​కు కాస్త ఇబ్బందిగా అనిపించింది. దీంతో శిర్డీలోనే నివాసం ఉండాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే జయప్రకాశ్ శిర్డీలో ఇల్లు కొనుక్కుని కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉండేవారు.

శిర్డీలో ఘనంగా దీపోత్సవం - పదకొండు వేల దీపాలు వెలిగించి 'సబ్ కా మాలిక్ ఏక్​' సందేశం

Shirdi Sai Donations: అనంతరం జయప్రకాశ్ శిర్డీలో విద్యార్థుల కోసం పాఠశాల(Starting a School in Shirdi)ప్రారంభించాలని అనుకున్నారు. అందుకోసం శిర్డీలోని సకూరి శివ్‌లో మూడున్నర గుంటల భూమిని కూడా కొనుగోలు చేశాడు. అయితే, కొన్నేళ్ల క్రితం జయప్రకాశ్ మృతి చెందాడు. దీంతో శిర్డీలో పాఠశాలను ప్రారంభించాలన్న ఆయన కల(Dream of Starting a School in Shirdi) నెరవేరలేదు.

One Crore Rupees House Donated to Shirdi Saibaba Temple: శిర్డీలో పాఠశాలను ప్రారంభించాలన్న ఆయన కలను నెరవేర్చాలని జయప్రకాశ్ భార్య, పిల్లలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మూడున్నర గుంటల స్థలంలో రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. అనంతరం ఈ భవనాన్ని విద్యా పనులకు ఉపయోగించాలని కోరుతూ.. సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీ.శివశంకర్‌(Shri Saibaba Sansthan Trust CEO P.Siva Sankar)కు.. జయప్రకాశ్ భార్య దరఖాస్తు చేశారు. నవంబర్ 29న పూజల అనంతరం ఈ భవనాన్ని శ్రీ సాయిబాబా సంస్థాన్‌కు అప్పగిస్తామని జయప్రకాశ్ భార్య శ్యామల తెలిపారు.

Bengaluru Devotee Donates House to Shirdi Sai: అయితే ఇప్పుడు శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్​(Shri Saibaba Sansthan Trust)కు విరాళంగా ఇచ్చిన ఈ భవనాన్ని విద్యా పనులకే వినియోగిస్తారా..? అనే ప్రశ్న తలెత్తుతోంది. సాయిబాబా సంస్థాన్.. శిర్డీలో సాయిబాబా ఇంగ్లీషు మీడియం స్కూల్(Saibaba English Medium School), సాయిబాబా కన్యా విద్యా మందిర్(Saibaba Kanya Vidya Mandir), జూనియర్&సీనియర్ కాలేజీ(Saibaba Junior & Senior College)ని నడుపుతోంది. దీని కోసం సాయి సంస్థ కోట్లాది రూపాయలతో భవనాలను నిర్మించింది.

Shirdi Sai Donations: గురు పూర్ణిమకు శిర్డీకి పోటెత్తిన భక్తులు.. రూ.7 కోట్లు విరాళాలు

Last Updated : Nov 29, 2023, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.