Devegowda family politics: మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ కుటుంబం దేశ రాజకీయాల్లో అరుదైన ఘనత సాధించింది. పార్లమెంట్‌తో పాటు కర్ణాటక అసెంబ్లీ ఉభయసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబంగా అవతరించింది. తాజాగా వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో దేవెగౌడ మనవడు సూరజ్ రేవన్న గెలుపొందిన తర్వాత ఈ రికార్డు సృష్టించింది. దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్డీ రేవన్న వారసుడే సూరజ్ రేవన్న.
Devegowda grandson suraj
జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ రాజ్యసభ సభ్యునిగా ఉండగా... ఆయన చిన్న కుమారుడు హెచ్డీ కుమారస్వామి చెన్నపట్నం ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. సూరజ్ సోదరుడు ప్రజ్వల్.. హాసన్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు సూరజ్ శాసనమండలికి ఎన్నికయ్యారు.
వీరితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు సైతం ప్రజా జీవితంలో ఉన్నారు. సూరజ్ తండ్రి హెచ్డీ రేవన్న ప్రస్తుతం హొలెనర్సిపుర నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తల్లి భవాని జిల్లా పరిషత్ సభ్యురాలిగా ఉన్నారు.
మరోవైపు, కుమారస్వామి సతీమణి అనిత రామనగర ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. వీరి కుమారుడు నిఖిల్ జేడీఎస్ యూత్ వింగ్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి సుమలత అంబరీష్ చేతిలో ఓడిపోయారు.
ఇదీ చదవండి: 'ప్రజల గొంతుకను అణచివేేసేందుకు కేంద్రం కుట్ర'