ETV Bharat / bharat

'50% ఉన్నా కనిపించరా?'.. కవిత వీడియోతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి

kavitha reddy congress karnataka: కర్ణాటక కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి కవితా రెడ్డి సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. మహిళలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఇవ్వకుండా.. సామాజిక న్యాయం ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించారు.

author img

By

Published : May 25, 2022, 11:22 AM IST

kavitha reddy congress karnataka
kavitha reddy congress karnataka

kavitha reddy congress karnataka: మహిళల పట్ల కాంగ్రెస్​ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని ఆ పార్టీ కర్ణాటక ప్రధాన కార్యదర్శి కవితా రెడ్డి తప్పుపట్టారు. 50 శాతం ఉన్న మహిళలను కాంగ్రెస్​ విస్మరిస్తోందని ఆరోపించారు. మహిళలకు రాజకీయాల్లో, చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇవ్వకుండా.. సామాజిక న్యాయం ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించారు. జూన్​ 3న జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో మహిళలకు స్థానం కల్పిచకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. ఈ మేరకు ఆమె ఫేస్​బుక్​లో వీడియో పోస్ట్​ చేశారు.

"టికెట్​ పొందిన పురుషులు అందరూ గెలవలేరు. అదే మహిళల విషయానికి వస్తే గెలుస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అన్ని రకాల వనరులు ఉండి పురుషులు ఓడిపోతున్నారు. దీనిపై పురుషులను ప్రశ్నించకుండా కేవలం మహిళలనే ప్రశ్నిస్తున్నారు. 50 శాతం ఉన్న జనాభాను కాంగ్రెస్​ పార్టీ ఎందుకు విస్మరిస్తోంది. శాసనసభ, మండలి,పార్లమెంట్​ల్లో మహిళలకు ప్రాతినిధ్యం లేదు. అంటే అర్థం మహిళలకు వీటిలో ప్రవేశం లేదా?"

-కవితారెడ్డి, కాంగ్రెస్​ పార్టీ జనరల్​ సెక్రటరీ

కర్ణాటక శాసనమండలిలో ఏడు స్థానాలకు జూన్​ 3న ఎన్నికలు జరగనున్నాయి. కాగా భాజపా సీనియర్​ నాయకులు లక్ష్మణ్​ సవడి, కేశవ ప్రసాద్​, హేమలత నాయక్​, చలవాడి నారాయణ స్వామిని ఎంపిక చేసింది.

ఇదీ చదవండి: స్పైస్​జెట్​పై సైబర్ దాడి.. నిలిచిపోయిన ఫ్లైట్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.