ETV Bharat / bharat

కొవిడ్ రెండో దశ విజృంభణకు కారణమిదే..! - డెల్టా వేరియంట్​పై అధ్యయనం

భారత్​లో కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రమవడానికి కారణం.. డెల్టా వేరియంట్​ అని ప్రభుత్య అధ్యయనంలో తెలిసింది. ఈ వేరియంట్​ బ్రిటన్​లోని ఆల్ఫా వేరియంట్​ కన్నా ప్రమాదకరమని నిపుణులు వెల్లడించారు.

delta variant
డెల్టా వేరియంట్, కరోనా వైరస్
author img

By

Published : Jun 4, 2021, 12:53 PM IST

భారత్​లో కరోనా రెండో దశ తీవ్ర స్థాయిలో విజృంభించటానికి ఇక్కడ గుర్తించిన డెల్టా వేరియంటే కారణమని ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. డెల్టా వేరియంట్‌లో బి.1.617.2 స్ట్రెయిన్‌, బ్రిటన్‌లో గుర్తించిన ఆల్ఫా వేరియంట్‌ కంటే ఎంతో ప్రమాదకరమైనదిగా ఇండియన్ సార్స్‌ కోవ్‌-2 జెనోమిక్ కన్సార్టియాతో పాటు నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్​ కంట్రోల్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఆల్ఫా రకంతో పోలిస్తే డెల్టా స్ట్రెయిన్‌ 50శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌ అన్ని రాష్ట్రాల్లో ఉందన్న అధ్యయన బృందం.. దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఎక్కువ మందికి సోకినట్లు తెలిపింది.

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ద్వారా ఇప్పటివరకు 12వేల 200 వేరియంట్లను గుర్తించినట్లు తెలిపిన శాస్త్రవేత్తలు.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే వాటి ప్రభావం స్వల్పమేనని చెప్పారు. మరోవైపు వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి సైతం డెల్టా వేరియంట్‌ రకం సోకుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. అయితే కొత్త రకం వేరియంట్ కారణంగా ఎక్కువ మరణాలు, వైరస్‌ తీవ్రత ఎక్కువ ఉన్న కేసులను తాము గుర్తించలేదని నిపుణులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:COWIN: తెలుగుతో పాటు 10 ప్రాంతీయ భాషల్లో కొవిన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.