దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్లు.. వుహాన్ రకం కరోనా వైరస్‌పై చూపించినంతగా డెల్టా వేరియంట్‌పై ప్రభావం చూపలేకపోతున్నాయి. దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి నిపుణులు చేపట్టిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మహారాష్ట్రలో తొలిసారి కనిపించిన డెల్టా వేరియంట్ (బి.1. 617.2)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ 'ప్రమాదకర వైరస్'గా వర్గీకరించింది. ఈ క్రమంలో డెల్టాపై టీకాల ప్రభావం ఎలా ఉందన్నది తెలుసుకునేందుకు వైద్య నిపుణులు పరిశోధన సాగించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ఇతర వేరియంట్లతో పోలిస్తే, డెల్టా రకంపై ఎనిమిదింతల తక్కువగా ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. "ఇతర వేరియంట్ల కారణంగా కొవిడ్‌కు గురై, కోలుకున్న వారిలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు.. డెల్టా రకాన్ని దీటుగా ఎదుర్కోలేకపోతున్నాయి. ఈ కారణంగానే పలువురు రెండోసారి ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు. దేశంలోని మూడు కేంద్రాల్లో పూర్తిస్థాయి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా 100 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్‌కు గురయ్యారు. ఎక్కువగా డెల్టా వైరస్ సోకడం వల్లే ఈ 'బ్రేక్ త్రూ' కేసులు తలెత్తాయి. ఈ వేరియంట్ కారణంగా శ్వాసవ్యవస్థ తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్కు గురవుతోంది. శ్వాస నాళాల్లో వైరస్ ప్రతిసృష్టి వేగంగా జరుగుతోంది. ఆరోగ్య కార్యకర్తల్లో ఈ వేరియంట్ సులభంగా వ్యాపిస్తోంది" అని నిపుణులు విశ్లేషించారు.
ఇదీ చూడండి: 'ఆగస్టు నుంచే కరోనా మూడో దశ వ్యాప్తి'
ఇదీ చూడండి: మెట్ల నడకతో గుండెకు మేలు!