ETV Bharat / bharat

సిగరెట్ ఫ్రీగా ఇవ్వలేదని నడి వీధిలో మహిళ గొంతు కోసి... - తెలుగు వార్తలు

దిల్లీలో చిన్న దుకాణం నడుపుకొనే మహిళను గొంతు కోసి హత్య (Delhi Woman Murdered) చేశాడు ఓ దుండగుడు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు.. ఉచితంగా సిగరెట్ అడిగితే ఇవ్వనందుకు (Murder for Cigarette) ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. నిందితుడిని స్థానికులు చితకబాదారు.

Murder for Cigarette
సిగరెట్ కోసం మర్డర్
author img

By

Published : Oct 5, 2021, 12:52 PM IST

సిగరెట్ ఫ్రీగా ఇవ్వలేదని మహిళ హత్య

దిల్లీలో దారుణ హత్య జరిగింది. (Delhi Murder news) ద్వారకా జిల్లాలోని డాబ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ గొంతు కోసి చంపాడు (Delhi Woman Murdered) ఓ దుండగుడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. (Murder for Cigarette)

మృతురాలు విభా(30) అదే ప్రాంతంలో చిన్న జనరల్ స్టోర్ నడుపుతోందని పోలీసులు తెలిపారు. నిందితుడు దీపక్.. తప్పతాగి దుకాణం దగ్గరికి వచ్చి ఫ్రీగా సిగరెట్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. (Murder for Cigarette) ఇందుకు మహిళ నిరాకరించింది. దీంతో మహిళతో దీపక్ వాగ్వాదానికి దిగాడని పోలీసులు చెప్పారు. క్రమంగా ఇది ఘర్షణగా మారిందని, పారిపోయేందుకు ప్రయత్నించిన మహిళను నిందితుడు కిరాతకంగా చంపేశాడని వివరించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధరించారని వెల్లడించారు.

చితకబాదిన స్థానికులు

దుకాణం వద్ద ఉన్న బ్యాగులోని పదునైన ఆయుధాన్ని హత్యకు వినియోగించాడు నిందితుడు. గొంతు కోసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, అక్కడే ఉన్నవారు అతడ్ని అడ్డగించి చితకబాదారు. పోలీసులు వచ్చి నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నించగా.. ఆగ్రహంతో ఉన్న స్థానికులు వారిపైనా దాడి చేశారు.

ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. పోలీసులను అడ్డుకోవడం, ప్రభుత్వ కార్యకలాపాలకు విఘాతం కలిగించడం వంటి కేసులు నమోదు చేశారు. స్థానికులు చేతిలో గాయపడ్డ నిందితుడిని ఆస్పత్రికి తరలించారు. అతడికి తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: కిడ్నాప్​కు గురైన బాలుడు మృతి- నరబలిగా అనుమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.