ETV Bharat / bharat

క్రైమ్ సిరీస్ స్ఫూర్తితో ప్రేయసి హత్య.. శవాన్ని 35 ముక్కలు చేసి.. ఫ్రిజ్​లో ఉన్న ముఖాన్ని రోజూ చూస్తూ.. - delhi love jihad

ప్రేమించిన యువతిని పాశవికంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. అనంతరం మృతదేహాన్ని 35 ముక్కలు చేశాడు. క్రైమ్ సినిమాల స్ఫూర్తితో మృతదేహాన్ని మాయం చేశాడు.

delhi woman murder
delhi woman murder
author img

By

Published : Nov 14, 2022, 7:31 PM IST

దిల్లీలో అత్యంత పాశవికమైన హత్య వెలుగులోకి వచ్చింది. ప్రియురాలిని చంపి, శవాన్ని ముక్కలు చేసి, ఫ్రిజ్​లో దాచి పెట్టిన ఘటన షాక్​కు గురిచేస్తోంది. మృతదేహం భాగాలను దిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు నిందితుడు. ఆరు నెలల క్రితం ఈ హత్య జరగగా.. తాజాగా ఈ కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడిని అఫ్తాబ్ అమిన్ పూనావాలా(28)గా గుర్తించారు.

అఫ్తాబ్​ ముంబయిలో నివాసం ఉండేవాడు. మృతురాలు శ్రద్ధా వాకర్(27) సైతం ముంబయిలోనే నివసించేది. నగరంలోని ఓ కాల్​సెంటర్​లో పనిచేస్తుండగా నిందితుడితో శ్రద్ధకు పరిచయం ఏర్పడింది. ఓ డేటింగ్ యాప్​ ద్వారా ఇరువురూ దగ్గరయ్యారు. అనంతరం ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఒకేచోట కలిసి జీవించడం ప్రారంభించారు. మూడేళ్ల పాటు లివిన్-రిలేషన్​షిప్ కొనసాగించిన ఇద్దరు.. వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే, వీరి పెళ్లికి ఇంట్లో పెద్దలెవరూ అంగీకరించలేదు. దీంతో దిల్లీకి మకాం మార్చారు. మెహ్‌రౌలీ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో దిగారు.

దిల్లీకి వచ్చిన తర్వాత శ్రద్ధ.. వివాహం చేసుకోవాలని అఫ్తాబ్​పై ఒత్తిడి తెచ్చింది. ఇందుకు అఫ్తాబ్ అంగీకరించకపోవడం వల్ల ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఘర్షణ పడుతూ ఒక్కోసారి వీరిద్దరూ నియంత్రణ కోల్పోయేవారు. ఈ క్రమంలోనే అఫ్తాబ్ దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమిస్తున్న యువతినే కడతేర్చాడు. గొడవ జరిగిన కోపంలో గొంతు నులిమి శ్రద్ధను హత్య చేశాడు. మే 18న ఈ ఘటన జరిగింది.

శవాన్ని ముక్కలు ముక్కలు చేసి..
అనంతరం, ఈ పాపం బయట పడకుండా చూసేందుకు తెగ ప్రయత్నాలు చేశాడు నిందితుడు. ఏకంగా శవాన్నే మాయం చేయాలని ఫిక్స్ అయ్యాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. శవాన్ని మొత్తం 35 భాగాలు చేశాడు. అలాగే ఉంచితే డీకంపోజ్ అవుతాయని భావించాడు. దీంతో ఓ రిఫ్రిజిరేటర్ కొనుక్కొచ్చాడు. శవ భాగాలను అందులో భద్రపరిచాడు. ఆ తర్వాత 18రోజుల పాటు మృతదేహ భాగాలను దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. అర్ధరాత్రుళ్లు బయటకు వెళ్లి శరీర విడిభాగాలను పడేసేవాడు అఫ్తాబ్.

నాలుగు నెలల వరకు దీనిపై ఎలాంటి విషయం బయటకు రాలేదు. అయితే, సెప్టెంబర్​లో శ్రద్ధ స్నేహితురాలికి అనుమానం వచ్చింది. శ్రద్ధ మొబైల్ స్విచ్ఛాఫ్ వస్తోందని, అసలు కాంటాక్టులోకి రావడం లేదని బాధితురాలి కుటుంబ సభ్యులను సంప్రదించారు. కుటుంబ సభ్యులు.. శ్రద్ధ సోషల్ మీడియాను చెక్​ చేయగా.. ఎలాంటి అప్డేట్స్ లేవని స్పష్టమైంది. దీంతో వారిలో ఆందోళన మొదలైంది. నవంబర్​లో బాధితురాలి తండ్రి వికాశ్ మదన్ వాకర్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. స్టేషన్​లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేయగా.. బాధితురాలి చివరి లొకేషన్ దిల్లీ అని తెలిసింది. దీని ఆధారంగా కేసును దిల్లీకి బదిలీ చేశారు. అప్పుడే బాధితురాలి తండ్రి.. అఫ్తాబ్​తో శ్రద్ధ రిలేషన్​షిప్ గురించి పోలీసులకు చెప్పారు. తన కూతురు కనిపించకుండా పోవడానికి అతడే కారణమై ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.

delhi woman murder
మృతురాలు శ్రద్ధ

ఈ దర్యాప్తులోనే అఫ్తాబ్, శ్రద్ధ దిల్లీకి వచ్చి నివాసం ఉంటున్నట్లు తేలింది. అనంతరం నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు పోలీసులు. అఫ్తాబ్​ను ప్రశ్నించగా.. నేరం ఒప్పుకున్నాడు. వివాహానికి బలవంతం చేయడం వల్లే నేరానికి పాల్పడాల్సి వచ్చిందని చెప్పాడు. నిందితుడి ఫ్లాట్​లో ఉన్న పలు ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా శరీర భాగాల స్వాధీనం కోసం ప్రయత్నిస్తున్నారు.

ఫ్రిజ్​లో ఉన్న ముఖాన్ని చూస్తూ..
పోలీసుల విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు.. యువతిని హత్య చేసిన గదిలోనే రోజూ నిద్రించేవాడని తేలింది. ఫ్రిజ్​లో శరీర భాగాలు ఉంచి, పైన తల భాగాన్ని పేర్చాడని పోలీసులు వెల్లడించారు. రోజూ ఫ్రిజ్ తలుపులు తీసి శ్రద్ధ ముఖాన్ని చూసేవాడని చెప్పారు. శరీర భాగాలను బయటపడేసిన తర్వాత ఫ్రిజ్​ను శుభ్రంగా కడిగాడని తెలిపారు.

ఆ పాత్ర స్ఫూర్తితో!
క్రైమ్ సినిమాలు చూసే ఈ హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. డెక్స్​టర్ సిరీస్​ను స్ఫూర్తిగా తీసుకొని హత్య చేసినట్లు తెలిపాడు. ఆ అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్​లో కథానాయకుడు డెక్స్​టర్ మోర్గన్.. ఫోరెన్సిక్ టెక్నీషియన్​గా పనిచేస్తాడు. నేరాలకు సంబంధించి మియామీ పోలీసు శాఖకు సహకరిస్తుంటాడు. మరోవైపు, రహస్యంగా అనేక హత్యలు చేస్తుంటాడు. న్యాయవ్యవస్థ నుంచి తప్పించుకున్న నేరస్థులను ఎవరికీ తెలియకుండా చంపుతాడు. శవాలను ముక్కలు ముక్కలుగా నరికి అరేబియా సముద్రంలో పడేసి పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తపడతాడు. ఈ సిరీస్​తో పాటు అనేక క్రైమ్ సినిమాలు, వెబ్​సిరీస్​లు చూసి హత్య చేసినట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.