సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు దిల్లీ పోలీసు ఎస్ఐ రాహుల్ సింగ్. 2017లో పాండవ్ నగర్ ఠాణాలో విధుల్లోకి చేరిన ఆయన.. తీవ్ర పని ఒత్తిడితోనే బలవన్మరణానికి పాల్పడ్డారని రాహుల్ భార్య పేర్కొన్నారు.
"స్టేషన్ హౌస్ ఆఫిసర్(ఎస్హెచ్ఓ) నుంచి ఆయన(రాహుల్)పై చాలా ఒత్తిళ్లు ఉన్నాయి. ఎప్పుడు ఫోన్ చేసినా తనకు సమయం లేదని చెప్పేవారు. సరిగ్గా నిద్ర పోయేవారు కాదు. ఆయనకు సెలవులూ దొరికేవి కావు," అని రాహుల్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ ఎప్పుడూ తన పని భారం గురించే మట్లాడేవారని అయన సోదరుడు తెలిపారు.
రాహుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చూడండి: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య!