దిల్లీ అల్లర్ల కేసు(Delhi Riots Case) విచారణ సందర్భంగా దిల్లీలోని ఓ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నిందితుల వద్ద నుంచి సేకరించిన మొబైల్ డేటాను సహ నిందితులకు ఇవ్వలేమని చెప్పింది. ఆ డేటాలో నిందితులకు చెందిన అశ్లీలమైన కంటెంట్ ఉన్నందున.. వాటిని ఇతరులకు అందజేస్తే వారి గోప్యతకు భంగం కలుగుతుందని వ్యాఖ్యానించింది.
గతేడాది జరిగిన దిల్లీ అల్లర్లలో(Delhi Riots Case).. మాజీ జేఎన్యూ నేత ఉమర్ ఖలీద్, జేఎన్యూ విద్యార్థులు నటాషా నర్వాల్, దేవంగణ కలితా, జామియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు సఫూరా జర్గార్, ఆప్ మాజీ కౌన్సిలర్ తహీర్ హస్సేన్ సహా మరో 13 మందిపై ఉగ్రవాద కార్యకలపాల నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై గురువారం న్యాయస్థానం విచారణ జరిపింది. అభియోగ పత్రం దాఖలుకు ఆధారంగా పరిగణించిన సాక్ష్యాధారాలు అన్నింటినీ తమకు ఇవ్వాలన్న నిందితుల విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
దిల్లీ అల్లర్లకు సంబంధించి కీలకమైన ఆధారాలను ప్రాసిక్యూషన్ తమకు సమర్పించిందని అదనపు సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ అమితాబ్ రావత్ తెలిపారు. అయితే... వీటిని ఎవరికీ అందుబాటులో ఉంచలేమని పేర్కొన్నారు.
"మొబైల్ ఫోన్లలోని సమాచారాన్ని ప్రాసిక్యూషన్ మాకు సమర్పించింది. అయితే.. ఆ వీడియోల, ఫొటోలు చూస్తే అవి ఎవరికీ అందుబాటులో ఉంచకూడనివిగా ఉన్నాయి. వాటిని నిందితుల తరఫు న్యాయవాదులకు కూడా అందించడానికి వీల్లేదు. ఎందుకంటే.. అందులో నిందితుల స్వీయ అశ్లీల వీడియోలు ఉన్నాయి. వాటిని వేరే వాళ్లకు అందుబాటులో ఉంచితే.. వారి గోప్యతకు భంగం కలుగుతుంది."
- అమితాబ్ రావత్, అదనపు సెషన్స్ జడ్జి
ఇవీ చూడండి:
'దిల్లీ అల్లర్ల వెనక పక్కా ప్రణాళిక'
'దిల్లీ అల్లర్లు ఉగ్ర చర్యలతో సమానం'