జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ.. దేశ రాజధాని ప్రాంతంలోనూ టపాసులు పేల్చారు. తీవ్ర వాయు కాలుష్యం దృష్ట్యా నవంబరు 30వరకూ దిల్లీలో బాణసంచా కాల్చడం, అమ్మకాలను ఎన్జీటీ నిషేధించింది. కానీ రాత్రి కాగానే దిల్లీలోని పలు వీధులు టపాసుల మోతతో దద్దరిల్లాయి.
-
#WATCH | People burst firecrackers in Pandav Nagar area of East Delhi on #Diwali.
— ANI (@ANI) November 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
National Green Tribunal (NGT) has imposed a total ban on the sale or use of all kinds of firecrackers in Delhi-NCR till November 30. pic.twitter.com/VHnTsp3NtW
">#WATCH | People burst firecrackers in Pandav Nagar area of East Delhi on #Diwali.
— ANI (@ANI) November 14, 2020
National Green Tribunal (NGT) has imposed a total ban on the sale or use of all kinds of firecrackers in Delhi-NCR till November 30. pic.twitter.com/VHnTsp3NtW#WATCH | People burst firecrackers in Pandav Nagar area of East Delhi on #Diwali.
— ANI (@ANI) November 14, 2020
National Green Tribunal (NGT) has imposed a total ban on the sale or use of all kinds of firecrackers in Delhi-NCR till November 30. pic.twitter.com/VHnTsp3NtW
బాణసంచా కాల్చడం సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల దిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగి తీవ్ర స్థాయికి చేరింది. గ్రేటర్ కైలాశ్, గోవింద్ పురీ, లజపత్నగర్, ఆర్కే పురం ప్రాంతాల్లో వాయు నాణ్యత దిగజారిందని అధికారులు తెలిపారు.
దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ప్రకారం.. ఆనంద్ విహార్, ఎయిర్పోర్ట్ ప్రాంతం, లోధి రోడ్డు, ఐటీఓ తదితర ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ తీవ్రస్థాయికి పడిపోయింది.
పోలీసులు చెప్పినా..
రాత్రి 8 గంటల వరకూ అనేక కాలనీల ప్రజలు బాణసంచా కాల్చారు. ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తే తక్షణం చర్యలు తీసుకునేందుకు తమ సిబ్బందిని అనేక ప్రాంతాల్లో మోహరించినట్లు దిల్లీ పోలీసులు చెప్పారు. కానీ ప్రజలు అక్కడక్కడా బాణసంచా కాలుస్తూ కనిపించారు.
దిల్లీ పొరుగునే ఉండే నోయిడాలోనూ భారీగానే టపాకాయలు పేల్చినట్లు స్థానికులు వెల్లడించారు. బాణసంచా అమ్మినందుకు 10 మందిని అరెస్ట్ చేసిన దిల్లీ పోలీసులు, 12 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు