ETV Bharat / bharat

నేడు రైతుల చక్కాజామ్​- దిల్లీ పోలీసులు అప్రమత్తం - రైతుల నిరసన తాజా వార్తలు

నూతన సాగు చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తున్న అన్నదాతలు.. దేశవ్యాప్తంగా శనివారం చక్కాజామ్​(రాస్తారోకో)ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రిపబ్లిక్​ డే నాటి.. ట్రాక్టర్​ ర్యాలీ ఉద్రిక్తతల దృష్ట్యా ఈసారి దిల్లీ పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆందోళన చేస్తోన్న రైతులను దిల్లీ నగరంలోకి అడుగుపెట్టనీయకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.

chakka jam
రహదారుల దిగ్బంధం..దిల్లీ పోలీసుల అలర్ట్‌!
author img

By

Published : Feb 6, 2021, 4:31 AM IST

వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తోన్న రైతు సంఘాలు శనివారం దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధానికి సిద్ధమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాస్తారోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దీంతో దీక్ష కొనసాగుతోన్న మూడు ప్రాంతాల్లో అదనపు బలగాలను రంగంలోకి దించారు. దిల్లీకి వచ్చే మూడు సరిహద్దుల్లో భారీ ముళ్లకంచెలు, మేకులతో, బారికేడ్లను ఏర్పాట్లు చేసిన పోలీసులు, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు.

అవసరమైతే.. మరిన్ని బలగాలు..

సాగు చట్టాలపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని ఇప్పటికే రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల దిగ్బంధన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే, జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయగా.. ఈసారి పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆందోళన చేస్తోన్న రైతులను దిల్లీ నగరంలోకి అడుగుపెట్టనీయకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా, సింఘు దీక్షాస్థలి వద్ద భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించడం సహా గాజీపూర్ సరిహద్దులోనూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. పరిస్థితులను బట్టి మరిన్ని బలగాలను రంగంలోకి దించడం, లేదా మరిన్ని ఎక్కువ బారికేడ్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని దిల్లీ పోలీసులు వెల్లడించారు.

సామాజిక మాధ్యమాలపై..

ముందస్తు జాగ్రత్తగా సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి అసత్య వార్తలు, వదంతులు వ్యాప్తిచేయకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల పోలీసులతోనూ తాము ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తామని తెలిపారు. నగరంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ నిశితంగా పరిశీలించిన తర్వాతే వారిని లోనికి అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, రైతులు తలపెట్టిన రహదారుల దిగ్బంధన కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు జరిగే అవకాశం ఉంది.

కాంగ్రెస్​ మద్దతు..

రైతులు చేపట్టనున్న రాస్తారోకోకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు కాంగ్రెస్​ ప్రకటించింది. ఈ నిరసనల్లో రైతులకు అండగా తమ పార్టీ శ్రేణులు పాల్గొంటాయని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ పేర్కొన్నారు. ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. చట్టాల గురించి రాజ్యసభలో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ చెప్పిన మాటలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయన్నారు.

అక్కడ చక్కాజామ్​ లేదు..

ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లో రాస్తారోకో ఉండబోదని భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​ పేర్కొన్నారు. రాస్తారోకోలో ఈ ప్రాంతంలో కొంత మంది హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లుగా తమకు తెలిసిందన్నారు. అందుకే.. ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్విహించటం లేదని తెలిపారు.

దిల్లీలోనూ రాస్తారోకో నిర్వహించట్లేదని రాకేశ్​ టికాయిత్​ తెలిపారు. ప్రభుత్వం తమను చర్చలకు ఎప్పుడైనా ఆహ్వానించవచ్చన్న ఉద్దేశంతోనే.. అక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం లేదని చెప్పారు.

ఆ వాహనాలకు ఇబ్బంది కలిగించం..

శనివారం తలపెట్టిన రాస్తారోకో కార్యక్రమం..​ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కొనసాగుతుందని సంయుక్త కిసాన్​ మోర్చా తెలిపింది. దిల్లీ మినహా అన్ని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను దిగ్బంధిస్తామని చెప్పింది. అంబులెన్సులు, పాఠశాలు బస్సులు ఇతర వాహనాలకు దారి ఇస్తామని.. శాంతియుతంగానే ఈ కార్యక్రమం కొనసాగిస్తామని పేర్కొంది.

ఇదీ చదవండి:సాగు చట్టాలపై 10 రాష్ట్రాలతో సుప్రీంకోర్టు కమిటీ చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.