స్వాతంత్ర్య దినోత్సవం సమయంలో దేశ రాజధానిలో ఉగ్ర దాడులు, హింసాత్మక ఘటనలు జరగొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్లీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన ప్రత్యేక బ్రాంచ్ పోలీసులు భారీ కుట్రను భగ్నం చేశారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 55 పిస్టళ్లు, 50 బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తుల్లో ఒకరు దిల్లీ వాసి కాగా.. మిగతా వారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారని తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట సహా పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్లు, బెలూన్లు వంటివి ఎగరవేయడంపై నిషేధం విధించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి : రాహుల్‌కు మరో షాక్.. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఖాతాపై!