కరోనా సోకి ప్రాణాలతో పోరాడుతున్న 200 మంది రోగులకు ఆక్సిజన్ సకాలంలో అందించి వారి ప్రాణాలను కాపాడారు దిల్లీ పోలీసులు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.
పశ్చిమ విహార్‌లోని బాలాజీ ఆసుపత్రిలో సోమవారం రాత్రి ప్రాణవాయువు కొరత ఏర్పడింది. ఉన్న ఆక్సిజన్‌ను కొద్ది గంటలు మాత్రమే రోగులకు అందించే క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. మరోవైపు హరియాణా, ఉత్తరప్రదేశ్ నుంచి ఆసుపత్రికి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లు సరిహద్దుల్లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సరిహద్దులకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆసుపత్రి వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి ట్యాంకర్లను పంపించారు. పోలీసు వాహనాలు ఎస్కార్ట్‌గా వస్తుండగా ట్యాంకర్లు హాస్పిటల్ చేరుకున్నాయి.
-
Green Corridor provided by #DelhiPolice outer distt & two #Oxygen tankers with 19500 ltr frm UP, Haryana border escorted to Covid Action Balaji Hospital. Also 25 Oxygen cylinders arranged thru cooperation of other hospitals.#DilKiPolice is serving you 24x7 as #IndiaFightsCorona pic.twitter.com/sSPoburUL6
— #DilKiPolice Delhi Police (@DelhiPolice) April 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Green Corridor provided by #DelhiPolice outer distt & two #Oxygen tankers with 19500 ltr frm UP, Haryana border escorted to Covid Action Balaji Hospital. Also 25 Oxygen cylinders arranged thru cooperation of other hospitals.#DilKiPolice is serving you 24x7 as #IndiaFightsCorona pic.twitter.com/sSPoburUL6
— #DilKiPolice Delhi Police (@DelhiPolice) April 20, 2021Green Corridor provided by #DelhiPolice outer distt & two #Oxygen tankers with 19500 ltr frm UP, Haryana border escorted to Covid Action Balaji Hospital. Also 25 Oxygen cylinders arranged thru cooperation of other hospitals.#DilKiPolice is serving you 24x7 as #IndiaFightsCorona pic.twitter.com/sSPoburUL6
— #DilKiPolice Delhi Police (@DelhiPolice) April 20, 2021
ఈ ఆసుపత్రిలో 235 మంది కొవిడ్ రోగులు ఆక్సిజన్‌పై ఉన్నారు. సరైన సమయానికి ట్యాంకర్లు రాకపోయి ఉంటే వీరి పరిస్థితి ప్రమాదంలో పడేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సకాలంలో ట్యాంకర్లు వచ్చేలా సాయం చేసిన దిల్లీ పోలీసులకు ఆసుపత్రి వర్గాలు కృతజ్ఞతలు తెలిపాయి.
ఇదీ చదవండి: 'మహా'లో కరోనా విలయం- ఆ రాష్ట్రాల్లో ఆంక్షలు