బిహార్ గోపాల్‌గంజ్‌లో జ్యోతి భూషణ్ కుమార్, బబ్లూ కుమార్ ఆర్య మధ్య పరిచయం ఉంది. గతంలో భూషణ్ కుమార్ ఓ ఎంపీకి వ్యక్తిగత సిబ్బందిగా విధులు నిర్వర్తించేవాడు. ఆ సమయంలో అతడికి పార్లమెంట్ పాస్ కూడా ఉండేది. కానీ అది 2019 జనవరి 31తో ముగిసింది. ఓ రోజు భూషణ్‌కు తెలియకుండా అతడి జేబులో నుంచి ఆ పాస్‌ను దొంగిలించాడు. ఆ పాస్‌ను ఓ ఇంటర్నెట్ షాప్‌లో ఎడిట్ చేసి నకిలీది సృష్టించాడు బబ్లూ. ఓ ఎంపీకి వ్యక్తిగత కార్యదర్శిగా పాస్ తయారుచేసుకున్నాడు.
కొన్ని రోజుల తర్వాత.. అధికారుల సిఫార్సులు లేకుండానే బబ్లూ ఆర్య అనే వ్యక్తి పేరుతో పార్లమెట్ పాస్‌ను రూపొందించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు పాస్‌ను ఉపయోగించవచ్చు కాబట్టి భద్రతా పరమైన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని సీనియర్ పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు.
గోపాల్‌గంజ్ వెళ్లి బబ్లూను పట్టుకున్నారు. భూషణ్‌ను కూడా విచారించారు. దర్యాప్తులో భాగంగా బబ్లూ మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టాడు. నకిలీ పాస్‌ను ఎలా సృష్టించాడనే విషయాన్ని వివరించాడు. ప్రజలను మోసం చేసేందుకు, తన గురించి తాను గొప్పలు చెప్పుకునేందుకే ఈ పనిచేసినట్టు బబ్లూ వెల్లడించాడు.
ఇదీ చూడండి:- ఐఎస్ఐ చేతికి భారత ఆర్మీ రహస్యాలు- జవాన్ అరెస్ట్