ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ.. పోస్టర్లు అంటించిన ఘటనలో దిల్లీ పోలీసులు 25 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 'మా పిల్లలకు ఇవ్వవలసిన వ్యాక్సిన్ లను విదేశాలకు ఎందుకు పంపుతున్నారు మోదీ' అని రాసి ఉన్న పోస్టర్లను దేశ రాజధాని ప్రధాన ప్రదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు.
మోదీని విమర్శిస్తూ పోస్టర్లు అంటిస్తున్నారనే సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతరం వచ్చిన ఫిర్యాదు మేరకు 25 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: 'ప్రతి పల్లెలో 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్!'