ETV Bharat / bharat

PM Modi: టీకా పంపిణీపై మోదీ సమీక్ష - prime minister office about pm reveiw

దేశంలో కొనసాగుతున్న కొవిడ్​ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ వారంలో టీకా పంపిణీలో వేగం పెరిగినందున.. ఆయన హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లోనూ ఇదే వేగాన్ని కొనసాగించాలని అధికారులకు సూచించారు.

modi meeting
టీకాలపై సమీక్ష
author img

By

Published : Jun 26, 2021, 6:28 PM IST

Updated : Jun 26, 2021, 9:21 PM IST

దేశవ్యాప్తంగా ఈ వారం కొవిడ్​ టీకా పంపిణీ వేగం పుంజుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లోనూ ఇదే వేగంతో వ్యాక్సిన్ పంపిణీ జరగాలని పేర్కొన్నారు. కొవిడ్​ టీకా పంపిణీ ప్రక్రియపై అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మోదీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు దేశంలో పంపిణీ చేసిన టీకా డోసుల వివరాలను మోదీకి అధికారులు వివరించారు.

"గత ఆరు రోజుల్లో 3.7 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశామని ప్రధానమంత్రికి అధికారులు తెలియజేశారు. ఈ సంఖ్య.. మలేసియా, కెనడా, సౌదీ అరేబియా వంటి దేశాల జనాభా కంటే అధికం."

-ప్రధానమంత్రి కార్యాలయం

కరోనా పరీక్షల విషయంలో రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని అధికారులను మోదీ సూచించారు. వైరస్​ను కట్టడి చేయటంలో పరీక్షలు అత్యంత ప్రధానమైన అంశమని పేర్కొన్నారు. టీకా పంపిణీ ప్రక్రియను విస్తృతం చేసేందుకు ఎన్​జీఓలు, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

modi meeting
వ్యాక్సినేషన్​ డ్రైవప్​పై మోదీ సమావేశం
modi meeting
అధికారులతో మోదీ సమీక్ష

ప్రజలందరికీ టీకా వేయటంలో వినూత్న పద్ధతులను పాటించేందుకు తాము రాష్ట్రాలతో కలిసి పని చేస్తున్నామని అధికారులు.. మోదీకి వివరించారు. కొవిన్ పోర్టల్​పై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని అధికారులు వివరించగా.. ఇతర దేశాలకు ఈ పోర్టల్​ రూపొందించటంలో భారత్ సాయం చేస్తుందని మోదీ తెలిపారు.

ఇదీ చూడండి: పసి పిల్లలకు కొవిడ్​-19 టీకా అవసరం లేదా?

ఇదీ చూడండి: 'టీకా తీసుకుంటేనే ఉద్యోగులకు ఈ నెల జీతం!'

Last Updated : Jun 26, 2021, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.