Delhi Night curfew: దిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 27 నుంచి రాత్రి కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 11.00 నుంచి ఉదయం 5.00 వరకు కర్ఫ్యూ నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
దిల్లీలో ఆదివారం 290 కరోనా కేసులు నమోదయ్యాయి. జూన్ 10 నుంచి ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే తొలిసారి. పాజిటివిటీ రేటు 0.55 శాతం పెరిగింది. దిల్లీలో ఇప్పటివరకు 14,43,352 కేసులు వెలుగుచూశాయి. 25,105 మరణాలు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: