ETV Bharat / bharat

వారు 'వర్క్​ ఫ్రమ్​ హోం' చేసేందుకు కేంద్రం నో- సుప్రీం అసహనం - DELHI NEWS TODAY ABOUT POLLUTION

దిల్లీలో కాలుష్య నివారణ చర్యలు సరిగా లేవని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. కేంద్ర, రాష్ట్రాలు నిందలు వేసుకోవడం మానుకొని.. ఎయిర్​ క్వాలిటీ మేనేజ్​మెంట్​ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

Delhi-NCR air pollution
దిల్లీ కాలుష్యం- సుప్రీంకోర్టులో విచారణ
author img

By

Published : Nov 17, 2021, 1:17 PM IST

Updated : Nov 17, 2021, 4:24 PM IST

దిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోమ్​ కల్పించటం సరికాదని సుప్రీం కోర్టుకు తెలిపింది కేంద్రం. అందుకు బదులుగా ఉద్యోగులు వాహనాలను షేర్​ చేసుకోవటం, ఒకే వాహనంలో ఎక్కువ మంది రావటం వంటి అంశాలను సూచించినట్లు పేర్కొంది. దాని ద్వారా రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య తగ్గుతుందని తెలిపింది. ఉద్యోగుల వాహనాల సంఖ్య తక్కువేనని, వాటిని ఆపటం ద్వారా పెద్దగా ఉపయోగం ఉండదని పేర్కొంది.

కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎయిర్‌ క్వాలిటీ కమిషన్ మేనేజ్‌మెంట్‌ సూచనల మేరకు పలు ప్రతిపాదనలతో అఫిడవిట్​ దాఖలు చేసింది కేంద్రం. అందులో అత్యవసర సరకుల వాహనాలు మినహా ఇతర ట్రక్కులను దిల్లీలోకి అనుమతించకపోవటం, పాఠశాలలను మూసివేయటం, జీఎన్​సీటీఐడీలోని కార్యాలయాల్లో 50 శాతం మాత్రమే హాజరయ్యేలా చూడడం వంటివి ఉన్నాయి. హరియాణా, పంజాబ్​, ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీ ప్రధాన కార్యదర్శులు సహా ఇతరులతో మంగళవారం జరిగిన సమావేశంలో పలు అంశాలను పరిశీలించినట్లు చెప్పారు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా.

ఈ క్రమంలో మంగళవారం జరిగిన సమావేశంలోని నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని దిల్లీ, ఎన్​సీఆర్​ పరిధిలోని రాష్ట్రాలకు సూచించింది సుప్రీం. ఈ సందర్భంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా అభ్యర్థిన క్రమంలో నవంబర్​ 24కు వాయిదా వేసింది.

'ప్రతీదీ కోర్టుకే వదిలేస్తున్నారు'

ప్రభుత్వ యంత్రాంగం జడత్వాన్ని ప్రదర్శిస్తోందని, ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలనుకోవట్లేదని వ్యాఖ్యానించింది సుప్రీం ధర్మాసనం. ప్రతి అంశాన్ని కోర్టుకు వదిలేస్తోందని అసహనం వ్యక్తం చేసింది. కాలుష్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని ఉదాసీనతగా పేర్కొంది కోర్టు.

ఎయిర్‌ క్వాలిటీ కమిషన్ సూచనలు ఇవే..

  • పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలు 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు రోడ్డుపైకి రాకుండా చూడాలి.
  • తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు దేశరాజధాని ఎన్​సీఆర్​ పరిధిలో అన్ని విద్యాసంస్థలు మూసివేయాలి.
  • 50శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలి.
  • ఈ నెల 21 నాటికి ప్రైవేటు సంస్థల్లోనూ వర్క్‌ ఫ్రమ్ హోంను ప్రోత్సహించాలి.
  • అనవసరమైన వస్తువులను తీసుకువెళ్లే ట్రక్కులు దేశ రాజధాని ప్రాంతంలోకి.. ప్రవేశించకుండా నిషేధం విధించాలి.
  • ఎన్​సీఆర్​ పరిధిలోని డీజిల్ జనరేటర్లు, అన్ని నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు కొనసాగించాలి.
  • దిల్లీలో వాటర్‌ స్ప్రింకర్లు, యాంటీ స్మోగ్​గన్‌లు అమర్చాలి.
  • దిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 11 థర్మల్ ప్లాంట్లలో ఆరింటిలో నవంబర్ 30 వరకు ఉత్పత్తి నిలిపివేయాలి.

ఇవీ చూడండి: ఎన్​సీఆర్​ పరిధిలో అప్పటివరకు స్కూళ్లు మూసివేత

అహ్మదాబాద్​ ఆశ్రమానికి వెళ్లి.. హైదరాబాద్​ యువకుడు మిస్సింగ్​

Last Updated : Nov 17, 2021, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.