దేశంలో కరోనా(covid) రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. పలు రాష్ట్రాలు అన్లాక్ దిశగా సాగుతున్నాయి. దిల్లీలో నెలన్నర తర్వాత లాక్డౌన్(lockdown) ఎత్తేయగా.. ప్రజలు తమ పనులను ప్రారంభించారు. రవాణా సదుపాయాలు, మార్కెట్లు మొదలయ్యాయి. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి.
దిల్లీలో సరి-బేసి విధానంలో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడుస్తున్నాయి.
దిల్లీలో అన్లాక్ ప్రక్రియతో నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వలసకూలీలు చేరుకుంటున్నారు. బస్ స్టాండ్లలో, ఫ్లై ఓవర్ల వద్ద జనం భారీగా దర్శనమిస్తున్నారు.
-
#WATCH | Traffic piles up at ITO as Delhi begins gradual unlocking from today pic.twitter.com/kN9oiEjUSZ
— ANI (@ANI) June 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Traffic piles up at ITO as Delhi begins gradual unlocking from today pic.twitter.com/kN9oiEjUSZ
— ANI (@ANI) June 7, 2021#WATCH | Traffic piles up at ITO as Delhi begins gradual unlocking from today pic.twitter.com/kN9oiEjUSZ
— ANI (@ANI) June 7, 2021
మహారాష్ట్రాలోనూ అన్లాక్ ప్రక్రియ మొదలైంది. రవాణా సౌకర్యాలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులను చేరవేయడానికి ప్రభుత్వ బస్సులు రోడ్లెక్కాయి. ఈ క్రమంలో బస్సు స్టాప్ల వద్ద జనం భౌతిక దూరం పాటించకుండానే బారులు తీరారు.