Man Murder For Ten Rupees: దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన జరిగింది. సిగరెట్ కొనుక్కోవడానికి పది రూపాయలు ఇవ్వడానికి నిరాకరించినందుకు ఓ వ్యక్తిని నలుగురు యువకులు దారుణ హత్య చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. బాధితుడిని విజయ్‌గా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 5న ఈ ఘటన జరిగింది. నలుగురు నిందితులు ఆనంద్ పర్బత్ ప్రాంతం నుంచి వస్తున్నారు. ఆ సమయంలో హెచ్ఆర్ రోడ్డు వద్ద సిగరెట్ తాగుతూ కూర్చున్న బాధితుడు విజయ్ను పది రూపాయలు అడిగారు. అతడు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో నిందితులు.. బాధితుడితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. గొడవ ముదిరి నలుగురు కలిపి విజయ్ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు.
ఇవీ చదవండి: పట్టాలు తప్పిన రైలు.. 10 మంది ప్రయాణికులు మృతి.. 50 మందికిపైగా గాయాలు
''కుడి చేయి నరికేస్తే ఏంటి? ఎడమ చేయి ఉందిగా!'.. ఆ నర్స్ తెగువకు సలాం'