ETV Bharat / bharat

సినీ ఫక్కీలో బ్యాంకు గోడకు కన్నం- రూ.లక్షల్లో దోపిడి - దిల్లీ క్రైమ్​ న్యూస్​

దిల్లీలో బ్యాంకు గోడకు కన్నం వేసి రూ.55 లక్షలను దోచేశాడో వ్యక్తి. అయితే.. బ్యాంకులో డ్రిల్లింగ్​ వర్క్​కు వచ్చిన వ్యక్తే.. ఈ చోరీకి పాల్పడ్డాడని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే హెల్మెట్​ పెట్టుకుని నిందితుడు చేసిన దోపిడి సినిమాని తలపించేలా ఉంది.

delhi bank robbery
దిల్లీలో బ్యాంకు చోరి
author img

By

Published : Jun 22, 2021, 9:59 PM IST

పక్కన నిర్మాణంలో ఉన్న భవనం నుంచి బ్యాంకు గోడకు కన్నం వేసి ఓ వ్యక్తి రూ. 55 లక్షలు దోచేశాడు. ఈ ఘటన దిల్లీలోని ఫార్ష్​ బజార్​ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగింది. అయితే హెల్మెట్​ పెట్టుకుని నిందితుడు చేసిన దోపిడి సినిమాని తలపించేలా ఉంది. ఈ చోరీలో నాటకీయ పరిణామాలు చూస్తే అవాక్కవుతారు.

సీసీటీవీ ట్యాంపరింగ్​..

అధికారుల ఫిర్యాదుతో సోమవారం ఉదయం వచ్చిన పోలీసులు.. చుట్టుపక్కల ఉన్న 50 సీసీటీవీలను తనిఖీ చేశారు. గత ఆర్నెళ్లుగా బ్యాంకు స్ట్రాంగ్​ రూమ్​లోకి వచ్చిన వారి డేటాను పరిశీలించారు. అయితే.. బ్యాంకు ఏటీఎం వద్ద ఉన్న సీసీటీవీ.. పక్కనే నిర్నాణంలో ఉన్న భవనం ముఖద్వారాన్ని రికార్డ్​ చేయగలదు. ఆ సీసీటీవీ దిశను మార్చినట్లు పోలీసులు గుర్తించారు. అందులో నిందితుల ముఖం, అరచేతి భాగాలు మిల్లీ సెకన్లపాటు ఉన్నట్లు కనుగొని దర్యాప్తు కొనసాగించారు.

బురిడీ కొట్టించడానికి యత్నించి..

సీసీటీవీల ఆధారంగా బ్యాంకు ఏటీఎం ఉన్న భవనానికి కాపలాగా ఉన్న వ్యక్తిని విచారించగా హరిరామ్​ పేరు బయటకు వచ్చింది. హరిరామ్​ మధ్యప్రదేశ్​కు చెందిన వ్యక్తి. దిల్లీలో భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు. కన్​స్ట్రక్షన్ వర్క్​లో పనిచేసేవాడు. హరిరామ్​ను విచారించారు పోలీసులు. తనకు ఓ వ్యక్తి రూ.10,000 ఇచ్చి సీసీటీవీ దిశని మార్చమన్నాడని చెప్పిన హరిరామ్​.. మొదట పోలీసులను బురిడి కొట్టించడానికి ప్రయత్నించాడు. కానీ తర్వాత నేరాన్ని అంగీకరించాడు. సీసీటీవీ దిశను తానే మార్చానని చెప్పాడు. బ్యాంకులో స్ట్రాంగ్​రూమ్​ రహస్యాలు ఎలా తెలుసని నిందితున్ని ప్రశ్నించగా.. పోలీసులకు సమాధానం ఇచ్చాడు.

దొంగ చేతికే తాళం..

ఆర్నెళ్ల క్రితం బ్యాంకులో గోడలకు అవసరం రీత్యా రంద్రాలు చేసేపనిని అధికారులు హరిరామ్​కు అప్పగించారు. కానీ అతడే బ్యాంకు గోడలకు కన్నాలేసి డబ్బు దోచుకెళతాడని బహుశా ఊహించి ఉండరు. గత మూడు నెలలుగా దొంగతనానికి ప్రయత్నించిన నిందితునికి లాక్​ డౌన్​ అనంతరం సమయం దొరికింది. ఆదివారం రాత్రి సమయంలో బ్యాంకు పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం నుంచి బ్యాంకులో స్ట్రాంగ్​ రూమ్​కి రంద్రం చేసి డబ్బును ఎత్తుకెళ్లాడని పోలీసులు తెలిపారు.

బ్యాంకులో డ్రిల్లింగ్ వర్క్​కు వెళ్లినప్పుడే స్ట్రాంగ్​ రూమ్​ రహస్యాలు, ఎంట్రీ, ఎగ్జిట్​ గురించి తెలుసుకున్నట్లు హరిరామ్​ ఒప్పుకున్నాడు. నిర్నాణంలో ఉన్న భవనం తాళం తీసేసి వేరే తాళంతో లోపలికి వెళ్లినట్లు పోలీసులకు చెప్పాడు.

రూ.54 లక్షల 48 వేలను హరిరామ్ గార్డ్​గా పనిచేసే ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.49,200 ను మరో నిందితుడు కాళీ చరణ్​​ నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు డ్రిల్లింగ్​ కోసం ఉపయోగించిన పలు పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:Rape: ఏడాదిన్నర చిన్నారిని ఎత్తుకెళ్లి.. హత్యాచారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.