కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారిలో తలనొప్పి, స్వల్ప అలర్జీలు రావటం సహజమే. కానీ... దిల్లీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం... 'అంతకుమించి' అంటున్నాడు. టీకా తీసుకున్న తర్వాత తనలో అయస్కాంత శక్తి ఉత్పన్నమైందని చెబుతున్నాడు.
దిల్లీలోని జహంగీర్‌పుర్ ప్రాంతానికి చెందిన రాజేశ్.. తాను మే 15న టీకా తీసుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత ఇనుము వంటి వస్తువులు తన శరీరాన్ని ఆకర్షించటం ప్రారంభమైందని పేర్కొన్నాడు.
"వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని గంటల తర్వాత నా శరీరంలో అయస్కాంత శక్తి ఉద్భవించింది. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు. ఇది కేవలం నేను వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే జరిగింది" అని పేర్కొన్నాడు. అది నిరూపించేందుకు ఓ వీడియోను సైతం రూపొందించాడు. అందులో కొన్ని వస్తువులను తన శరీరానికి అంటుకున్నట్లు చూపించాడు. తనకు ఇంతవరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని, వైద్యులను సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
అమెరికాలోనూ..
ఇలాంటి సంఘటన భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ జరిగింది. టీకా వల్ల అయస్కాంత శక్తి వస్తుందని నిరూపించాలని ప్రయత్నించి ఓ నర్సు అభాసుపాలైంది.
అమెరికాలోని ఒహాయో రాష్ట్రానికి చెందిన జోవన్నా ఓవర్హోల్ట్ అనే నర్సు వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ.. తనలో మ్యాగ్నెటిక్ పవర్స్ అభివృద్ధి చెందినట్లు నిరూపించేందుకు ప్రయత్నించింది. ఒహాయో చట్ట సభ హెల్త్ కమిటీ ముందు.. నేరుగా ప్రదర్శన చేసి చూపించాలనుకుంది. పిన్నులు తన శరీరానికి అంటుకుంటున్నాయని చూపించే ప్రయత్నం చేసి విఫలమైంది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారగా.. విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
-
Wow. An anti-vaccine nurse in Ohio tried to prove the Vaccines Cause Magnetism theory in an state legislative committee. The demonstration did not go to plan pic.twitter.com/0ubELst4E8
— Tyler Buchanan (@Tylerjoelb) June 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Wow. An anti-vaccine nurse in Ohio tried to prove the Vaccines Cause Magnetism theory in an state legislative committee. The demonstration did not go to plan pic.twitter.com/0ubELst4E8
— Tyler Buchanan (@Tylerjoelb) June 9, 2021Wow. An anti-vaccine nurse in Ohio tried to prove the Vaccines Cause Magnetism theory in an state legislative committee. The demonstration did not go to plan pic.twitter.com/0ubELst4E8
— Tyler Buchanan (@Tylerjoelb) June 9, 2021
అయితే.. ఇలాంటివి జరిగినట్లు ఎక్కడా నిరూపితం కాలేదు. వ్యాక్సిన్లు సురక్షితమని, చిన్న చిన్న దుష్ప్రభావాలు మినహా.. ఎలాంటి మార్పులు కనిపించలేదని అంతర్జాతీయ నిపుణులు, వైద్యులు ఇప్పటికే స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'కొవిడ్ టీకాతో ఎలాంటి ఇబ్బందుల్లేవ్..'