Delhi Jewellery Shop Robbery : దేశ రాజధాని దిల్లీలోని ఓ జ్యువెలరీ షోరూమ్‌లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. స్ట్రాంగ్ రూమ్ గోడకు రంధ్రం చేసి.. లోపలకు చొరబడి రూ.20-25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దొరక్కుండా ఉండేందుకు సీసీటీవీలను కూడా ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భోగల్.. జంగ్‌పురా ప్రాంతంలో ఉన్న ఉమ్రావ్ సింగ్ జ్యువెలరీ షోరూమ్‌లో ఈ చోరీ ఘటన జరిగింది. ఆదివారం దుకాణాన్ని మూసివేసిన యజమాని సంజీవ్ జైన్.. మంగళవారం తెరవగా అసలు విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుకాణ యజమానితో పాటు షాప్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరనీ విచారించారు. షోరూమ్ వెలుపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు.
'భారీ చోరీ ఘటన'
ఈ ఘటనపై దిల్లీ సౌత్- ఈస్ట్ డీసీపీ రాజేశ్ డియో స్పందించారు. ఇది భారీ చోరీ ఘటనగా వర్ణించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను గమనించినట్లు చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులను రప్పించినట్లు తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తానని అన్నారు.
'సర్వం దోచేశారు!'
Robbery At Gold Showroom : "ఆదివారం రాత్రి 8 గంటలకు అంతా చెక్ చేసుకుని షాప్‌ను మూసివేశాం. సోమవారం దుకాణానికి సెలవు. మంగళవారం షాప్‌ను తెరిచి చూడగా మొత్తం దుమ్ము, ధూళితో నిండి ఉంది. అనుమానం వచ్చి స్ట్రాంగ్‌రూమ్ వద్దకు వెళ్లాం. స్ట్రాంగ్ రూమ్ గోడకు భారీ రంధ్రాన్ని గమనించాం. వెంటనే పోలీసులకు సమాచారం అందించాం. సుమారు రూ.5-7 లక్షలు నగదు సహా రూ.20-25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. షోరూమ్ లోపలకు చొరబడి అంతా దోచేశారు. సీసీటీవీలను కూడా ధ్వంసం చేశారు" అని యజమాని సంజీవ్ జైన్ తెలిపారు.
-
दुकान मालिक ने बताया, "हम रविवार को दुकान बंद कर के गए थे और मंगलवार की सुबह जब दुकान खोली तो हमें पूरी दुकान में धूल दिखाई दी। पता लगाने पर पता चला कि चोरों ने स्ट्रांग रूम की दीवार में गड्ढा कर सामान चोरी किया है। करीब 20-25 करोड़ का सामान चोरी हुआ जिसमें 5-7 लाख रुपए नकद भी… pic.twitter.com/FRFPSvl1QQ
— ANI_HindiNews (@AHindinews) September 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">दुकान मालिक ने बताया, "हम रविवार को दुकान बंद कर के गए थे और मंगलवार की सुबह जब दुकान खोली तो हमें पूरी दुकान में धूल दिखाई दी। पता लगाने पर पता चला कि चोरों ने स्ट्रांग रूम की दीवार में गड्ढा कर सामान चोरी किया है। करीब 20-25 करोड़ का सामान चोरी हुआ जिसमें 5-7 लाख रुपए नकद भी… pic.twitter.com/FRFPSvl1QQ
— ANI_HindiNews (@AHindinews) September 26, 2023दुकान मालिक ने बताया, "हम रविवार को दुकान बंद कर के गए थे और मंगलवार की सुबह जब दुकान खोली तो हमें पूरी दुकान में धूल दिखाई दी। पता लगाने पर पता चला कि चोरों ने स्ट्रांग रूम की दीवार में गड्ढा कर सामान चोरी किया है। करीब 20-25 करोड़ का सामान चोरी हुआ जिसमें 5-7 लाख रुपए नकद भी… pic.twitter.com/FRFPSvl1QQ
— ANI_HindiNews (@AHindinews) September 26, 2023
Gold Shop Robbery Viral Video : నగల దుకాణంలో చోరీ.. అడ్డొచ్చిన పోలీసులపై కాల్పులు.. ఆఖరికి..
Axis Bank Robbery Raigarh : యాక్సిక్ బ్యాంక్‌లో భారీ దోపిడీ.. సిబ్బందిని గదిలో వేసి రూ.7కోట్లు చోరీ