Delhi High Court Fines Central Government : ఓ స్వాతంత్ర్య సమరయోధుడికి పెన్షన్ ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శించినందుకు కేంద్రానికి రూ.20వేల జరిమానా విధించింది దిల్లీ హైకోర్టు. 96 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు ఉతిమ్ లాల్ సింగ్‌కు పెన్షన్ ఇవ్వకుండా కేంద్రం అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏడాదికి 6 శాతం వడ్డీ చొప్పున 1980 ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు ఉన్న బకాయిలను చెల్లించాలని ఆదేశించింది. వీటిని 12 వారాల్లోగా బాధితుడికి ఇచ్చేయాలని చెప్పింది. దీంతో పాటు పెన్షన్ ఇవ్వకుండా అలసత్వం వహించిన కేంద్రానికి రూ.20వేలు జరిమానా విధించారు జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్.
అయితే, ఉతిమ్ లాల్ సింగ్ కేసును బిహార్ ప్రభుత్వం.. దిల్లీ హైకోర్టుకు ప్రతిపాదించింది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. ఉతిమ్ లాల్ సింగ్‌కు పెన్షన్ ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఆయనకు పెన్షన్ ఇవ్వాలని జిల్లా మెజిస్ట్రేట్ ధ్రువీకరించినా.. ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ఇది పెన్షన్ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైందని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం చాలా బాధాకమని పేర్కొంది.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో బిహార్‌కు చెందిన ఉతిమ్ లాల్ సింగ్ చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయనపై అనేక కేసులు పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. వీటిపై విచారణ చేసి ఉతిమ్ లాల్ సింగ్ భూమిని జప్తు చేసింది. అయితే, దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వారికి కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సైనిక్ సమ్మాన్ పెన్షన్‌ను ఇస్తుంది.
52 ఏళ్ల న్యాయపోరాటానికి దక్కిన ఫలితం.. 'ఆమె'కు రూ.16 లక్షల పెన్షన్!
అంతకుముందు ఒడిశాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బాలేశ్వర్‌కు చెందిన ఓ మహిళ తన భర్త మరణించిన తర్వాత అందాల్సిన పింఛను సొమ్ము కోసం 52 ఏళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. 89 ఏళ్ల వయసులో ఆమెకు రూ.16 లక్షల తాత్కాలిక పెన్షన్ వచ్చింది. ఆరాద్ బజార్‌కు చెందిన లలితా మొహంతి 37 సంవత్సరాల వయస్సులో తన భర్త భీమ్‌సేన్‌ను కోల్పోయారు. ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో భీమ్‌సేన్ పనిచేస్తూ కన్నుమూశారు. ఆయన మరణానంతరం.. లలితకు ఓఎస్ఆర్టీసీ నుంచి ఎటువంటి పెన్షన్ రాలేదు. అందుకు లలిత సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. ఎట్టకేలకు ఆమెకు న్యాయం జరిగింది. తొమ్మిదేళ్ల క్రితం కోర్టు ఇచ్చిన ఆదేశాలనుసారం.. లలితకు ఓఎస్ఆర్టీసీ రూ.16 లక్షలు చెల్లించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
'సారూ నేను బతికే ఉన్నా.. పెన్షన్ ఇవ్వండి'.. అధికారులకు 70 ఏళ్ల వృద్ధుడు రిక్వెస్ట్.. కానీ!
Pension Scam: 21 ఏళ్ల క్రితం మృతి.. 12 ఏళ్లుగా ఆయన పేరుపై పింఛన్.. పల్నాడు జిల్లాలో స్కామ్