ETV Bharat / bharat

ఇష్టం లేని శృంగారాన్ని వద్దనే హక్కు 'ఆమె'కు ఉందా? - వివాహితుల హక్కులు

Women Right No to Sex: పెళ్లయినా.. కాకున్నా.. ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కు ప్రతి మహిళకు ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన.. ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కును మహిళలు కోల్పోతారా? అని ప్రశ్నించింది. వివాహితలు, అవివాహితల గౌరవాన్ని వేర్వేరుగా చూడలేమని పేర్కొంది.

Women Right to No to Sex
Women Right to No to Sex
author img

By

Published : Jan 12, 2022, 6:56 AM IST

Updated : Jan 12, 2022, 9:51 AM IST

Women Right No to Sex: వివాహితలు, అవివాహితల గౌరవాన్ని వేర్వేరుగా చూడలేమని దిల్లీ హైకోర్టు పేర్కొంది! పెళ్లయినా.. కాకున్నా.. ఇష్టం లేని లైంగిక చర్యను నిరాకరించే హక్కు ప్రతి మహిళకూ ఉంటుందని ఉద్ఘాటించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ రాజీవ్‌ శక్ధేర్‌, జస్టిస్‌ సి.హరిశంకర్‌ల ధర్మాసనం మంగళవారం ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

వివాహితలకు ఆ సెక్షన్​ వర్తించదా?

"పెళ్లయినంత మాత్రాన.. భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినా- మహిళ కేవలం ఇతర సివిల్‌, క్రిమినల్‌ చట్టాలనే ఆశ్రయించాలా? భారత శిక్షాస్మృతి(ఐపీసీ)- 375 (అత్యాచారం) సెక్షన్‌ ఆ కేసులో వర్తించదా? ఇది సరికాదు" అని ధర్మాసనం పేర్కొంది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన.. ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కును మహిళలు కోల్పోతారా అని ప్రశ్నించింది. ఐపీసీ-375 సెక్షన్‌ పరిధిలో భర్తలకు ఇచ్చిన మినహాయింపులు.. రాజ్యాంగంలోని అధికరణం-14, అధికరణం-21లను ఉల్లంఘించేలా ఉన్నాయా అన్నది పరిశీలించాల్సిన అవసరం ధర్మాసనానికి ఉందని పేర్కొంది. 50 దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తున్న సంగతిని గుర్తుచేసింది.

అయితే దిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది నందిత రావ్‌ మాత్రం భర్తలకు ప్రస్తుతం ఉన్న మినహాయింపులను రద్దు చేయాల్సిన అవసరం లేదని వాదించారు. ఈ మినహాయింపులు భార్యల గౌరవానికి భంగం కలిగిస్తున్నట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు.

అది నేరం కాదా?

దీంతో జస్టిస్‌ శక్ధేర్‌ కలుగజేసుకొని.. "ఓ మహిళ నెలసరిలో ఉన్నప్పుడు.. భర్తతో శృంగారంలో పాల్గొనేందుకు నిరాకరించారనుకోండి. అయినప్పటికీ బలవంతంగా ఆయన లైంగిక చర్యకు పాల్పడ్డారనుకోండి. అది నేరం కాదా?" అని ప్రశ్నించారు.

"అది నేరమే. కానీ అత్యాచార చట్టం పరిధిలోకి రాదు" అని నందిత బదులిచ్చారు.

న్యాయమూర్తి స్పందిస్తూ.. "ఇదే ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. సహజీవనం చేసేవారి విషయంలో ఈ చర్య ఐపీసీ-375 పరిధిలోకి వస్తుంది. వివాహిత విషయంలో రాదు. ఎందుకు? సంబంధాన్ని బట్టి అలా చెప్పడం సరికాదు" అని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: '20 రోజుల్లో 13 వేల మంది గూండాలు అరెస్టు'

Last Updated : Jan 12, 2022, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.