దిల్లీలోని ప్రజలందరికీ టీకా పంపిణీ చేసేందుకు సిద్ధమని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొవిడ్ వ్యాప్తి నివారణ చర్యలతో పాటు బాధితులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ వంటివి పూర్తిగా అందుబాటులో ఉన్నట్లు దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. టీకా అందుబాటులోకి వస్తే 3,4 వారాల్లోనే దిల్లీ ప్రజలకు పంపిణీ చేస్తామని స్పష్టంచేశారు.
"దిల్లీలో ఎప్పుడైతే టీకా అందుబాటులోకి వస్తుందో కొన్నివారాల్లోనే దిల్లీ అంతటా పంపిణీ చేస్తాం. మా వద్ద చాలా ఆరోగ్య వసతులున్నాయి. మొహల్లా క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు, డిస్పెన్సరీలు, ఆసుపత్రులు వంటి అనేక మౌలిక వసతులు ఉన్నాయి. నిల్వ సమస్యే లేదు. ఎప్పుడు టీకా అందుబాటులోకి వస్తుందో అప్పుడు దిల్లీ అంతటా 3, 4 వారాల్లోనే పంపిణీ చేసే సామర్థ్యం మాకు ఉంది."
--సత్యేంద్ర జైన్ దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి
కొవిడ్ వ్యాక్సిన్ పురోగతిపై ప్రధాని పర్యటనపై స్పందించేందుకు సత్యేంద్ర జైన్ నిరాకరించారు. దిల్లీలో కొత్తగా 5,482 మంది వైరస్ బారిన పడ్డారు.
ఇదీ చూడండి:ఆ 8 రాష్ట్రాల్లోనే మహమ్మారి వ్యాప్తి అధికం