దిల్లీలో ఘెర ప్రమాదం జరిగింది. పడమర దిల్లీలోని ఖయాల ప్రాంతంలో ఓ కర్మాగారం పైకప్పు కూలి నలుగురు కూలీలు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విష్ణు గార్డెన్ ప్రాంతంలోని ఓ మోటారు వైండింగ్ ఖార్ఖానాలో ఈ ప్రమాదం జరిగింది.
కర్మాగారంలో ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కర్మాగారంలో చిక్కుకున్న ఆరుగురు కూలీలను కాపాడి, సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నలుగురు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: తిరుమల నుంచి వస్తుండగా వెంటాడిన మృత్యువు