ETV Bharat / bharat

'దిల్లీలో కొవిడ్​ రోగులకు ఆక్సిజన్​ కొరత' - ప్రధానికి లేఖ రాసిన కేజ్రీవాల్​

దిల్లీలో ఆక్సిజన్​ కొరత మరింత పెరిగినట్లు ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటాను ఇతర రాష్ట్రాలకు మళ్లించారని ఆరోపించారు.

Delhi facing acute shortage of oxygen, kejriwal
'దిల్లీలో కొవిడ్​ రోగులకు ఆక్సిజన్​ కొరత'
author img

By

Published : Apr 19, 2021, 6:03 AM IST

దిల్లీ తీవ్రమైన ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దిల్లీకి రావాల్సిన వాటాను కేంద్రం ఇతర రాష్ట్రాలకు మళ్లించిందని ఆరోపించారు. దేశ రాజధానిలో కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచడం సహా తక్షణమే ఆక్సిజన్ సరఫరాలో సహాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్​ లేఖ రాశారు.

"దిల్లీ తీవ్రమైన ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా సాధారణ సరఫరా కంటే ఇప్పుడు ఎక్కువ అవసరం. ఈ నేపథ్యంలో సరఫరా మరింత పెంచాల్సిన కేంద్రం.. సాధారణంగా మాకు వచ్చే వాటాలో కూడా కోత పెడుతోంది. మాకు రావాల్సినవి ఇతర రాష్ట్రాలకు మళ్లించారు. దిల్లీలో ఆక్సిజన్​ అత్యవసర పరిస్థితి ఏర్పడింది."

-అరవింద్​ కేజ్రీవాల్, దిల్లీ సీఎం

ఆక్సిజన్ విషయంలో దిల్లీ సీఎం అబద్దాలు చెప్తున్నారని కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: పరిశ్రమలకు ఆక్సిజన్​ సరఫరాపై కేంద్రం నిషేధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.