Delhi Earthquake Today : దేశ రాజధాని దిల్లీని మంగళవారం భారీ భూకంపం వణికించింది. దిల్లీతోపాటు జాతీయ రాజధాని ప్రాంతం-NCRలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం వెల్లడించింది. నేపాల్‌లో భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దిల్లీతో సహా పొరుగున ఉన్న పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా రాష్ట్రాల్లో కూడా 40 సెకన్లపాటు భూమి కంపించిందని వెల్లడించింది.
-
#WATCH | Uttar Pradesh | People rushed out of their buildings in Lucknow as strong tremors were felt in different parts of north India.
— ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
As per National Centre for Seismology, an earthquake with a magnitude of 6.2 on the Richter Scale hit Nepal at 2:51 pm today. pic.twitter.com/CDTEtKVhJy
">#WATCH | Uttar Pradesh | People rushed out of their buildings in Lucknow as strong tremors were felt in different parts of north India.
— ANI (@ANI) October 3, 2023
As per National Centre for Seismology, an earthquake with a magnitude of 6.2 on the Richter Scale hit Nepal at 2:51 pm today. pic.twitter.com/CDTEtKVhJy#WATCH | Uttar Pradesh | People rushed out of their buildings in Lucknow as strong tremors were felt in different parts of north India.
— ANI (@ANI) October 3, 2023
As per National Centre for Seismology, an earthquake with a magnitude of 6.2 on the Richter Scale hit Nepal at 2:51 pm today. pic.twitter.com/CDTEtKVhJy
వెంట వెంటనే భూ ప్రకంపనలు..
మంగళవారం మధ్యాహ్నం 2.25 సమయంలో మొదటిసారి 4.6 తీవ్రతతో భూ ప్రకంపనలను నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ(ఎన్‌సీఎస్) గుర్తించింది. ఇది పది కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్‌సీఎస్ వెల్లడించింది. ఈ తీవ్రతను గుర్తించిన అరగంటలోపే అంతకంటే ఎక్కువ తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. కాగా, దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా రికార్డయింది.
-
#WATCH | Earthquake tremors felt in Khatima, Uttarakhand. pic.twitter.com/vzUterBau7
— ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Earthquake tremors felt in Khatima, Uttarakhand. pic.twitter.com/vzUterBau7
— ANI (@ANI) October 3, 2023#WATCH | Earthquake tremors felt in Khatima, Uttarakhand. pic.twitter.com/vzUterBau7
— ANI (@ANI) October 3, 2023
ట్విట్టర్ వేదికగా పోలీసుల అలర్ట్..
రెండోసారి ప్రకంపనలు రావడం వల్ల ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ప్రజలెవరూ ఆందోళనకు గురికావద్దని దిల్లీ పోలీసులు కోరారు. 'దయచేసి భవన సముదాయాల్లో ఉన్న ప్రతిఒక్కరూ సురక్షిత ప్రాంతాలకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎవరూ లిఫ్ట్‌లు గానీ ఎలివేటర్లు గానీ వినియోగించవద్దని మేము అభ్యర్థిస్తున్నాము. ఎమర్జెన్సీ కోసం 112కు డయల్ చేయండి' అని ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. రెండోసారి సంభవించిన భూకంపం తర్వాత దిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడం వల్ల ఇళ్లు, ఆఫీసుల్లో ఉన్న ఫ్యాన్లు, లైట్లు కదలాడాయి.
-
#WATCH | Earthquake tremors felt across Delhi-NCR. Visuals from Noida Sector 75 in Uttar Pradesh. pic.twitter.com/dABzrVoyVw
— ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Earthquake tremors felt across Delhi-NCR. Visuals from Noida Sector 75 in Uttar Pradesh. pic.twitter.com/dABzrVoyVw
— ANI (@ANI) October 3, 2023#WATCH | Earthquake tremors felt across Delhi-NCR. Visuals from Noida Sector 75 in Uttar Pradesh. pic.twitter.com/dABzrVoyVw
— ANI (@ANI) October 3, 2023
-
#WATCH | Delhi: People rush out of the office building as strong tremors of earthquake were felt across North India.
— ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Visuals from outside the Asian News International (ANI) office in RK Puram sector 9. pic.twitter.com/wX1fyutNvp
">#WATCH | Delhi: People rush out of the office building as strong tremors of earthquake were felt across North India.
— ANI (@ANI) October 3, 2023
Visuals from outside the Asian News International (ANI) office in RK Puram sector 9. pic.twitter.com/wX1fyutNvp#WATCH | Delhi: People rush out of the office building as strong tremors of earthquake were felt across North India.
— ANI (@ANI) October 3, 2023
Visuals from outside the Asian News International (ANI) office in RK Puram sector 9. pic.twitter.com/wX1fyutNvp
బయటకొచ్చిన కేంద్ర మంత్రి..
భూ ప్రకంపనల ధాటికి సెంట్రల్ దిల్లీలోని నిర్మాణ్ భవన్లో ఉన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మనసుఖ్ మాండవీయ కూడా అధికారులతో కలిసి బయటకు వచ్చారు. మరోవైపు ఉత్తరభారతంలోని జైపుర్, చండీగఢ్ ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. కాగా, ప్రకంపనల కారణంగా ఎంతమేర నష్టం జరిగిందనే దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
-
#WATCH | Delhi | Union Health Minister Mansukh Mandaviya stepped out of Nirman Bhawan, along with others, as strong tremors hit different parts of north India. pic.twitter.com/8EbNFX4b46
— ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Delhi | Union Health Minister Mansukh Mandaviya stepped out of Nirman Bhawan, along with others, as strong tremors hit different parts of north India. pic.twitter.com/8EbNFX4b46
— ANI (@ANI) October 3, 2023#WATCH | Delhi | Union Health Minister Mansukh Mandaviya stepped out of Nirman Bhawan, along with others, as strong tremors hit different parts of north India. pic.twitter.com/8EbNFX4b46
— ANI (@ANI) October 3, 2023
పశ్చిమ నేపాల్‌లో 4 సార్లు..
పశ్చిమ నేపాల్‌లోనూ గంట వ్యవధిలోనే నాలుగుసార్లు భూమి కంపించినట్లు ఆ దేశ జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. తొలుత 4.6 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ ఖాట్మండుకు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బజాంగ్ జిల్లాలోని తల్కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల సమయంలో భూకంపం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. పది కిలోమీటర్లు లోతులో అది కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్‌సీఎస్ పేర్కొంది. ఇది గుర్తించిన అరగంటలోపే రెండోసారి కూడా 6.3 తీవ్రతతో ఇదే ప్రాంతంలో 3:06 గంటల సమయంలో మరో భూపంకపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. తర్వాత మరో రెండుసార్లు స్వల్ప తీవ్రతతో భూమి కంపించినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు.