ETV Bharat / bharat

బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్​ కేసులో అరిజ్​ ఖాన్​కు ఉరిశిక్ష

2008 Batla House encounter case.
బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్​ కేసులో అరిజ్​ ఖాన్​కు ఉరిశిక్ష
author img

By

Published : Mar 15, 2021, 5:47 PM IST

Updated : Mar 15, 2021, 7:03 PM IST

17:43 March 15

బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్​ కేసులో అరిజ్​ ఖాన్​కు ఉరిశిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 'బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్'​ కేసులో దోషిగా తేలిన అరిజ్​ ఖాన్​కు ఉరిశిక్ష విధించింది దిల్లీ కోర్టు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా అభివర్ణించింది. ఉరిశిక్షతో పాటు మొత్తం రూ.11 లక్షల జరిమానా విధించింది. తక్షణమే ఇన్​స్పెక్టర్​ ఎంసీ శర్మ కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలని ఆదేశించారు అదనపు సెషన్స్ న్యాయమూర్తి సందీప్​ యాదవ్​.  

2008లో జరిగిన ఈ ఘటనలో ఇన్​స్పెక్టర్​ మోహన్​ చంద్​ శర్మ(ఎంసీ శర్మ)ను అరిజ్​ ఖాన్​, అతని సహచరులు హత్యచేసినట్టు సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైందని ఈనెల 8న తీర్పు వెలువరించింది దిల్లీ కోర్టు. అయితే.. ఏ శిక్ష విధించాలనే అంశంపై 15న విచారిస్తామని తెలిపింది. తాజాగా.. సోమవారం విచారించిన న్యాయస్థానం ఉరి శిక్షను ఖరారు చేసింది. 

ఇదీ కేసు..

2008లో.. దిల్లీలో ఇండియన్​ ముజాహిదీన్​ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో.. జామియా నగర్​లోని బాట్లా హౌస్​ ప్రాంతంలో దిల్లీ పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులపై ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగడం వల్ల.. ఇన్​స్పెక్టర్​ ఎంసీ శర్మ అమరుడయ్యారు. అనంతరం.. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

అయితే.. ఈ కేసుతో సంబంధమున్న​ ఉగ్రవాది షాజాద్​ అహ్మద్​కు.. 2013 జులైలో జీవిత ఖైదు విధించింది ట్రయల్​ కోర్టు. ఆ తర్వాత.. 2018లో ప్రధాన నిందితుడు అరిజ్​ఖాన్​ను అరెస్ట్​ చేశారు దిల్లీ పోలీసులు.

Last Updated : Mar 15, 2021, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.