ETV Bharat / bharat

Delhi CM House Renovation : కేజ్రీవాల్​కు CBI చిక్కులు.. ఇంటి రిపేరుకు రూ.44కోట్లు ఖర్చుపై కేసు! - కేజ్రీవాల్​ ఇల్లు పునర్​నిర్మాణంపై సీబీఐ విచారణ

Delhi CM House Renovation : దిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం పునర్​నిర్మాణంలోని అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రాథమిక విచారణను చేపట్టింది. దిల్లీ ప్రభుత్వంలోని పలువురు అధికారులను ప్రశ్నించనున్నట్లు చెప్పింది.

Delhi CM House Renovation
Delhi CM House Renovation
author img

By PTI

Published : Sep 27, 2023, 6:54 PM IST

Updated : Sep 27, 2023, 7:49 PM IST

Delhi CM House Renovation : దిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం పునర్​నిర్మాణంలో నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలపై చర్యలకు ఉపక్రమించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ విషయంలో ప్రాథమిక విచారణను చేపట్టినట్లు సీబీఐ అధికారులు బుధవారం వెల్లడించారు. దిల్లీ ప్రభుత్వంలోని పలువురు అధికారులను ప్రశ్నించనున్నట్లు తెలిపారు. టెండర్ పత్రాలు, మార్బుల్​ ఫ్లోరింగ్, మాడ్యులర్ కిచెన్​ పనుల వివరాలు, కాంట్రాక్టర్లు సమర్పించిన బిడ్లు, భవనం ప్లాన్​ ఆమోదం లాంటి పత్రాలను ఇవ్వాలని దిల్లీ ప్రజాపనుల శాఖను ఆదేశించినట్లు చెప్పారు. వీటితో పాటు కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లుల రికార్డులను సైతం ఇవ్వాలని తెలిపారు.

'ఆప్​ను అంతమొందిచేందుకు బీజేపీ ప్రయత్నాలు'
AAP On Kejriwal House Renovation : మరోవైపు దిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాస పునర్​నిర్మాణంలో అక్రమాలపై వస్తున్న ఆరోపణలను ఖండించింది ఆమ్ఆద్మీ పార్టీ. ఆప్​ను అంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. ఇందుకోసం తన అధికారాలన్నింటినీ ఉపయోగిస్తోందని విమర్శించింది. ఆప్​ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఎంపీ సంజయ్​ సింగ్​. దేశంలోనే అత్యుత్తమ విద్య, వైద్యం అందించిన మంత్రుల మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్​ను జైలులో వేశారన్నారు. ఎన్ని దర్యాప్తులు చేసినా.. కేజ్రీవాల్​ సామాన్య ప్రజల కోసమే పోరాటం చేస్తారనని చెప్పారు.

కేజ్రీవాల్​పై ప్రతిపక్షాల ఫైర్​
BJP On Kejriwal House Renovation : ఆమ్​ ఆద్మీ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్​ ఎదురుదాడికి దిగాయి. అధికారంలోకి వచ్చాక సామాన్యుడిలా ఓ సాధారణ ఇంటిలో ఉంటానని చెప్పిన కేజ్రీవాల్​.. ఆ మాటలను మరిచిపోయారని ఆరోపించాయి. తన నివాసం కోసం అనవసర ఖర్చు చేశారని విమర్శించాయి.

Kejriwal House Renovation Case : సివిల్ లైన్స్​లో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం- షీశ్​ మహాల్​ను పునర్​నిర్మించింది దిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రజాపనుల శాఖ. ఈ నివాసంపై ఇప్పటివరకు రూ. 44 కోట్లు ఖర్చు చేశారు. పునర్​నిర్మాణంలో అవకతవకలు జరిగాయని.. ఈ మేరకు కాగ్​తో ఆడిట్ చేయించాలని మే 24న కేంద్ర హోం శాఖకు ప్రతిపాదిస్తూ లేఖ రాశారు లెఫ్టినెంట్​ గవర్నర్ వీకే సక్సేనా. దీనిపై చర్యలు తీసుకున్న హోం శాఖ.. స్పెషల్​ ఆడిట్​ నిర్వహించాలని కాంప్ట్రోలర్ అండ్​ ఆడిటర్ జనరల్​కు సూచించింది. తాజాగా సీబీఐ సైతం ప్రాథమిక విచారణను చేపట్టింది.

'అంత మంచి వ్యక్తిని జైలులో ఎలా పెట్టారు?'.. సిసోదియాను తలచుకుని కేజ్రీవాల్ ఎమోషనల్

PM Degree Case : దిల్లీ సీఎం కేజ్రీవాల్​కు షాక్​.. ప్రధాని డిగ్రీ కేసులో సుప్రీం కీలక నిర్ణయం

Last Updated : Sep 27, 2023, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.