ETV Bharat / bharat

కేజ్రీవాల్​ భద్రతా సిబ్బందిని తగ్గించలేదు: కేంద్రం - arvind kejriwal security

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​కు భద్రతను కుదించినట్లు వచ్చిన వార్తలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఖండించింది.

delhi-cm-arvind-kejriwals-security-cover-allegedly-reduced
కేజ్రీవాల్​ భద్రతా సిబ్బంది తొలగింపు!
author img

By

Published : Feb 25, 2021, 10:26 PM IST

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ భద్రతా సిబ్బందిని కుదించారంటూ వచ్చిన వార్తలను కేంద్ర హోంశాఖ ఖండించింది. అటువంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. కేజ్రీవాల్​ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కుదించినట్లు అంతకుముందు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఆరుగురు అంగరక్షకులు ఉంటారని.. వారిలో నలుగురిని తొలిగించినట్లు పేర్కొన్నాయి.

ఇటీవల జరిగిన గుజరాత్​ మున్సిపల్​ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ పార్టీ విజయాన్ని తట్టుకోలేని భాజపా అధినాయకత్వం సిబ్బందిని తొలగించిందని ఆప్​ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం వివరణ ఇచ్చింది.

కేజ్రీవాల్​కు జెడ్ ప్లస్​ కేటగిరి భద్రతను అందించనున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఉండే 47 సిబ్బందితో పాటు కమాండోలు కూడా ఉంటారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'రైతులతో ఎప్పుడైనా చర్చలకు సిద్ధమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.