ETV Bharat / bharat

దిల్లీలో పౌల్ట్రీ విక్రయాలపై నిషేధం ఎత్తివేత

పౌల్ట్రీ క్రయ విక్రయాలకు దిల్లీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బర్డ్​ ఫ్లూ దృష్ట్యా విధించిన ఆంక్షలను ఎత్తివేసింది.

delhi govt on poultry
పౌల్ట్రీ క్రయ విక్రయాలకు దిల్లీ ప్రభుత్వం అనుమతి
author img

By

Published : Jan 14, 2021, 6:20 PM IST

Updated : Jan 14, 2021, 6:48 PM IST

పౌల్ట్రీ అమ్మకాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది దిల్లీ ప్రభుత్వం. దిల్లీలోని ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్​లో బర్డ్​ ఫ్లూ ఆనవాళ్లులేవని స్పష్టమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, పశు సంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్​ సింగ్​ నిషేధం ఎత్తివేతపై స్పష్టత ఇచ్చినట్లు తూర్పు దిల్లీ మేయర్ నిర్మల్ జైన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముగ్గురు మేయర్లు, ముగ్గురు మునిసిపల్ కార్పొరేషన్​ కమిషనర్లు పాల్గొన్నారని తెలిపారు. దిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మూడు నగరపాలికల్లోనూ పౌల్ట్రీ క్రయవిక్రయాలకు అనుమతి లభించిందని వివరించారు.

ఇదీ చదవండి:

దిల్లీకి ఊరట- ఆ మార్కెట్​లో బర్డ్​ ఫ్లూ లేదంట!

పౌల్ట్రీ ఉత్పత్తుల సరఫరాపై నిషేధం వద్దు: కేంద్రం

Last Updated : Jan 14, 2021, 6:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.