దిల్లీలోని జైపుర్ గోల్డెన్ ఆస్పత్రికి ఓ ఆక్సిజన్ ట్యాంకర్ సకాలంలో చేరుకుంది. శుక్రవారం రాత్రి ప్రాణవాయువు కొరతతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న 25 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ చికిత్స పొందుతున్న 200 మంది కరోనా రోగుల్లో 80 శాతం మంది ఆక్సిజన్పైనే ఆధారపడి ఉన్నారు. మరో 35 మంది ఐసీయూలో ఉన్నారు.
![Oxygen tanker arrives at Jaipur Golden Hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11521011_m.jpg)
ఈ నేపథ్యంలో వారి ప్రాణాలకూ ముప్పు పొంచి ఉండటం వల్ల.. కేంద్రం అప్రమత్తమై ఆక్సిజన్ ట్యాంకర్ను తరలించింది.
ఇదీ చూడండి: ఆక్సిజన్ లీకేజీ ఘటన- సీసీటీవీ దృశ్యాలు వైరల్