ETV Bharat / bharat

దిల్లీ ఎయిమ్స్​లో అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులో భారీగా మంటలు! - ఎయిమ్స్‌ ఆస్పత్రిలో దిల్లీలో అగ్నిప్రమాదం

Delhi Aiims Fire Accident : దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. రెండో అంతస్తులో ఉన్న ఎండోస్కోపీ గదిలో మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు ఎనిమిది ఫైర్‌ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.

delhi-aiims-fire-accident-fire-breaks-out-near-aiims-delhi-emergency-ward
దిల్లీ ఎయిమ్స్​లో అగ్ని ప్రమాదం
author img

By

Published : Aug 7, 2023, 12:43 PM IST

Updated : Aug 7, 2023, 2:11 PM IST

Delhi Aiims Fire Accident : దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం రెండో అంతస్తులో ఉన్న ఎండోస్కోపీ గదిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను అక్కడి నుంచి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు 13 ఫైర్‌ ఇంజిన్లతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.

delhi-aiims-fire-accident-near-aiims-delhi-emergency-ward
దిల్లీ ఎయిమ్స్​లో అగ్ని ప్రమాదం
delhi-aiims-fire-accident-near-aiims-delhi-emergency-ward
దిల్లీ ఎయిమ్స్​లో అగ్ని ప్రమాదం

సోమవారం ఉదయం 11.54 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. ఎమర్జెన్సీ వార్డు పైన ఉన్న ఎండోస్కోపీ గదిలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. రోగులందరినీ ప్రమాద వార్డు నుంచి సురక్షితంగా తరలించిన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని తెలిపిన అధికారులు.. దాదాపు ఒంటి గంట ప్రాంతంలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు వివరించారు. మంటలను ఆర్పేందుకు ఆసుపత్రి​ వాటర్​ ట్యాంక్​ నీటిని కూడా వినియోగించినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలయాల్సి ఉంది.

  • #WATCH | Delhi: A fire broke out in the endoscopy room of AIIMS. All people evacuated.

    More than 6 fire tenders sent, say Delhi Fire Service

    Further details are awaited. pic.twitter.com/u8iomkvEpX

    — ANI (@ANI) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎయిమ్స్​ కన్వర్జెన్స్‌ బ్లాక్‌లో మంటలు..
Fire incident in Delhi Aiims : కొంత కాలం క్రితం కూడా ఇదే దిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు కన్వర్జెన్స్‌ బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే అక్కడికి చేరుకుని మొత్తం 22 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చాయి.

రాత్రి పూట ఆసుపత్రి భవనంలోని తొమ్మిదో అంతస్తులో మంటలు చెలరేగినట్లు అప్పట్లో ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం తలెత్తలేదు. ప్రమాదం జరిగిన తొమ్మిదో అంతస్తులో పలు లాబొరేటరీలు, అధునాతన పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. లోపల 120 మందికిపైగా రోగులు.. టెన్షన్​ టెన్షన్​!
Fire Accident In Hospital : వారం రోజుల క్రితం గుజరాత్​లోని అహ్మదాబాద్​లో ఉన్న పది అంతస్తుల 'రాజస్థాన్ హాస్పిటల్'​లోనూ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రి బేస్​మెంట్​లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 125 మంది రోగులను వేర్వేరు ఆస్పత్రికి తరలించారు సిబ్బంది. ఘటనపై సమచాారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే అక్కడికి వెళ్లి మంటలను అదుపు చేశారు.

రోగికి పెట్టిన ఆహారంలో బొద్దింక.. దిల్లీ ఎయిమ్స్​లో ఘటన!

దోపిడీ చేసిన పోలీసులు.. వ్యాపారవేత్తను బెదిరించి రూ.కోటి లూటీ.. తనిఖీలు చేస్తూ..

Last Updated : Aug 7, 2023, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.