ETV Bharat / bharat

రష్యా, ఉక్రెయిన్​ యుద్ధాన్ని మోదీ ఆపారన్న రాజ్​నాథ్​ సింగ్​ - భారత రక్షణ శాఖ మంత్రి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో రష్యా, ఉక్రెయిన్​ కొన్ని రోజులు యుద్ధాన్ని ఆపాయని రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ పేర్కొన్నారు. 22 వేల మంది విద్యార్థులను కాపాడటానికి ఇరు దేశాల అధినేతలతో మోదీ మాట్లాడారని చెప్పారు. లఖ్​నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్​నాథ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

defence minister rajnath singh
defence minister of india
author img

By

Published : Aug 28, 2022, 8:00 PM IST

Defence Minister Rajnath Singh: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో రష్యా- ఉక్రెయిన్ కొన్ని రోజులు యుద్ధాన్ని ఆపాయని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్​లో చిక్కుకున్న 22 వేల మంది భారత విద్యార్థులను కాపాడేందుకు వ్లాదిమిర్​ పుతిన్​కు, వొలొదిమిర్​ జెలెన్​స్కీకి మోదీ ఫోన్లు చేసి మాట్లాడారని గుర్తు చేశారు. చార్​బాగ్​ ప్రాంతంలోని రబీంద్రాలయ్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్​ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. విద్యార్థులకు జీవితం పట్ల దిశానిర్దేశం చేశారు. తన గురువు మౌల్వీ సాహిబ్​తో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకున్నారు.

defence minister rajnath singh
విద్యార్థికి అభినందన పత్రం ఇస్తున్న రాజ్​నాథ్​సింగ్

భారత్​ రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని కొన్ని రోజులు ఎలా ఆపారో అనే విషయాన్ని విద్యార్థులకు వివరించారు. అందులో భాగంగా ప్రధాన మంత్రి ఇరు దేశాలను యుద్ధాన్ని కొద్ది రోజులు ఆపాలని అడిగారని అన్నారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో కూడా మాట్లాడారన్నారు. దీంతో ఇరుదేశాలు యుద్ధానికి కొన్ని రోజులు విరామం ఇచ్చాయని చెప్పారు. దీంతో భారత విద్యార్థులను అక్కడినుంచి సురక్షితంగా స్వదేశానికి తీసువచ్చారన్నారు. రెండు దేశాల మధ్య ఉద్ధృతంగా సాగుతున్న యుద్ధాన్ని, మూడో దేశం కారణంగా ఆపడం చరిత్రలో ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో భారత్​కు ఎంత గౌరవం ఉందో ఈ ఒక్క సంఘటన ద్వారా చెప్పొచ్చని పేర్కొన్నారు.

ఇదే సక్సెస్​ మంత్ర..
ప్రసంగంలో భాగంగా విద్యార్థులకు విజయ మంత్రాన్ని ఉపదేశించారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా గౌరవ, మర్యాదలతో మెలగాలని సూచించారు. కొన్ని పరిమితులను ఎప్పటికీ దాటవద్దన్నారు. "రావణుడు గొప్ప పండితుడు అయినప్పటికీ, మనం అతడిని పూజించము. కానీ రాముడిని పూజిస్తాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు గౌరవాన్ని పాటించాడు. అందరినీ గౌరవించాడు. అందుకే అతడిని మర్యాద పురుషోత్తం అని అంటాం. మనం కూడా పరిమితులకు లోబడి జాగ్రత్తగా ఉండాలి. అలా అందరితో మర్యాదగా, గౌరవంగా ఉంటేనే సమాజంలో మనకూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలా సంఘంలో గౌరవమర్యాదలు సంపాదించడమే గొప్ప ఆస్తి" అని చెప్పారు.

వివేకనందుడే వెలుగు దివిటీ..
వివేకానంద ఇప్పటికీ, ఎప్పటికీ యువతకు వెలుగు దివిటీలా ఉంటాడన్నారు. ప్రతి యువత, ప్రతి విద్యార్థి స్ఫూర్తిదాతలందరూ వివేకానందులేనన్నారు. విశ్వ మత సమ్మేళనంలో ఇనుప గోపురంలా స్వామీ వివేకానంద నిలబడ్డారని పేర్కొన్నారు. ప్రపంచంలోని అగ్రదేశాలు కూడా భారత్​ను గౌరవిస్తున్నాయని చెప్పారు.

గురువులని గౌరవించాలి..
"నా చిన్నతనంలో మౌల్వీ సాహిబ్​ మాకు పాఠాలు చెప్పేవారు. కొన్నిసార్లు ఆయన చాలా కోపానికి గురయ్యేవారు. మేము కూడా అలానే కోపానికి గురయ్యేవాళ్లం. అలా అందరికీ జరుగుతుంది. అయితే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు సంఘటన నాకు ఇంకా గుర్తుంది. నేను మౌల్వీ సాహెబ్ గ్రామం పక్కన ఉన్న రహదారి గుండా వెళ్తున్నా. తన వద్ద చదువుకున్న నేను ఈరోజు విద్యామంత్రి అయ్యాడని, పక్క ఊరి రోడ్డు గుండా వెళ్తున్నానని మౌల్వీ సాహిబ్‌కు కూడా తెలుసు. నన్ను చూడాలనుకున్నా.. వృద్ధాప్యం వల్ల ఆయన ఇబ్బంది పడ్డారు. అయినా తన ఇద్దరి కుమారుల సాయంతో రోడ్డు వద్దకు చేరుకున్నారు. నేను అయన్ను చూసి కారు ఆపి కిందకు దిగాను. అనంతరం ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాను. అలా పెద్దవారిని గౌరవించాలి అందులో ప్రత్యేకంగా గురువులని. ఇలా విద్యార్థులందరూ తమ గురువులను గౌరవిస్తారని ఆశిస్తున్నాను. మీరు జీవితంలో గొప్ప స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను" అని రాజ్​నాథ్​ సింగ్ అన్నారు.

ఇవీ చదవండి: పేకమేడల్లా కూలిన ట్విన్​ టవర్స్, ఆఖరి నిమిషంలో గాలి ట్విస్ట్​ ఇచ్చినా

వరదలో కొట్టుకుపోయిన లారీ, మూడు టన్నుల సిమెంట్ గంగపాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.