ETV Bharat / bharat

రక్షణ మంత్రి రాజ్​నాథ్​కు కరోనా.. ఇద్దరు సీఎంలకు కూడా.. - Rajnath Singh corona news

Rajnath Singh Corona: రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మరోవైపు బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు కూడా కొవిడ్​ సోకింది.

Defence Minister Rajnath Singh test positive for COVID-19
రాజ్​నాథ్​ సింగ్​కు కరోనా
author img

By

Published : Jan 10, 2022, 4:20 PM IST

Updated : Jan 10, 2022, 9:28 PM IST

Rajnath Singh Corona: రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్న కారణంగా హోం క్వారెంటైన్​లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని రాజ్​నాథ్​ సింగ్​ సూచించారు.

ఐదు రోజుల క్రితం రాజ్‌నాథ్‌.. వాయుసేన అధికారులతో సమావేశమయ్యారు. సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంపై ఐఏఎఫ్‌ చీఫ్‌.. రాజ్‌నాథ్‌ను కలిసి నివేదిక సమర్పించారు.

బిహార్ సీఎంకు..

బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ కూడా వైరస్​ బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు హోం క్వారెంటైన్​లో ఉన్నట్లు పేర్కొన్నారు.

కర్ణాటక సీఎంకు..

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్​గా తెలినట్లు తెలిపారు. తాను ఆరోగ్యం బాగుందని.. స్వీయనిర్భందంలో ఉన్నట్లు సీఎం బొమ్మై ట్వీట్​ చేశారు.

మరో కేంద్రమంత్రి...

కేంద్రమంత్రి అజయ్​ భట్​ కొవిడ్​ సోకింది. స్పల్ప లక్షణాలు ఉన్నట్లు అజయ్​ తెలిపారు. ప్రస్తుతం హోం క్వారెంటైన్​లో ఉన్నట్లు పేర్కొన్నారు.

జేపీ నడ్డాకు..

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొవిడ్​ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు నడ్డా పేర్కొన్నారు. వైద్యాధికారుల సూచన మేరకు స్వీయనిర్భందంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

ఇటీవల కేంద్రమంత్రులు భారతి పవార్‌, మహేంద్ర నాథ్ పాండే, నిత్యానంద్‌ రాయ్‌తో పాటు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌, భాజపా ఎంపీలు మనోజ్‌ తివారీ, వరుణ్‌ గాంధీ తదితరులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి:

కంటైన్మెంట్​ జోన్​లో ఫ్రెండ్స్​తో కొవిడ్​ రోగి పార్టీ

Last Updated : Jan 10, 2022, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.