ETV Bharat / bharat

'దేశంలో హెల్త్​ ఎమర్జెన్సీ ప్రకటించండి'

దేశంలో కరోనా విజృంభణ దృష్ట్యా జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు కాంగ్రెస్ నేత కపిల్ సిబల్. ఎన్నికల ర్యాలీలపైనా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు.

national health emergency, Sibal to PM
ఆరోగ్య అత్యవసర స్థితి, నరేంద్ర మోదీ, కపిల్ సిబల్
author img

By

Published : Apr 18, 2021, 12:12 PM IST

Updated : Apr 18, 2021, 12:31 PM IST

కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఆరోగ్య అత్యయిక స్థితి ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. అలాగే ఎన్నికల ప్రచార ర్యాలీలపై తాత్కాలికంగా నిషేధం విధించాలని ఆదివారం విజ్ఞప్తిచేశారు.

Declare a national health emergency: Sibal to PM
కపిల్ సిబల్ ట్వీట్

"కొవిడ్​ 19తో కోలుకున్నవారి కన్నా వేగంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. మోదీజీ.. జాతీయ ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించండి. ఎన్నికల సంఘం.. ప్రచార ర్యాలీలపై తాత్కాలిక నిషేధం విధించాలి. కోర్టులు ప్రజల ప్రాణాలను రక్షించాలి"

- కపిల్ సిబల్, కాంగ్రెస్ నేత

దేశంలో వరుసగా నాలుగో రోజూ 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,61,500 కేసులు రాగా, మొత్తం బాధితుల సంఖ్య 1,47,88,109కు పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 18 లక్షల మార్కు దాటిందని ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్​డౌన్​ సహా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి.

ఇదీ చూడండి: ఆక్సిజన్​ కొరతతో ఆరుగురు రోగులు మృతి

Last Updated : Apr 18, 2021, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.