ETV Bharat / bharat

'కేరళలో ఆత్మాహుతి దాడి చేస్తాం'.. ప్రధానికి బెదిరింపులు.. సెక్యూరిటీ వివరాలు లీక్

ప్రధాని నరేంద్ర మోదీపై దాడి చేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. మోదీ కేరళ పర్యటనకు వస్తే.. ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని అందులో ఉంది. దీనిపై పోలీసులు అప్రమత్తమయ్యారు. లేఖపై విచారణ జరుపుతున్నారు. ఏప్రిల్​ 24న కేరళలో రెండు రోజుల పాటు ప్రధాని పర్యటించనున్నారు.

death-threat-letter-to-pm-modi-in-kerala-visit-threat-letter-to-modi-assassination
కేరళ పర్యటనకు ప్రధాని మోదీకి బెదిరింపు లేఖ
author img

By

Published : Apr 22, 2023, 12:38 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కేరళ పర్యటనకు వస్తే ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని ఓ బెదిరింపు లేఖ విడుదలైంది. ఎర్నాకులం వాసి జోసెఫ్ జాన్ నడుముత్తమిల్ పేరుతో.. కేరళ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి ఈ లేఖ వచ్చింది. ఏప్రిల్​ 24న కేరళలో రెండు రోజుల ప్రధాని పర్యటన ఉన్న నేపథ్యంలో.. ఈ లేఖ బయటకు రావడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

లేఖపై రాష్ట్ర పోలీసులు, నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నాయి. వారం రోజుల క్రితం ఈ లేఖ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరిందని పోలీసులు తెలిపారు. అనంతరం ఆ లేఖను పోలీసు ముఖ్య అధికారికి.. బీజేపీ నాయకులు అందించారని వెల్లడించారు. కాగా శనివారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రధాని కేరళ పర్యటనలో భద్రతా ఉల్లంఘనలు..
మరోవైపు, కేరళలో ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రతా ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన పర్యటన నేపథ్యంలో ఏడీజీపీ ఇంటెలిజెన్స్ రూపొందించిన వీవీఐపీల భద్రత వివరాలు.. రాష్ట్ర పోలీసుల నుంచి లీక్​ అయ్యాయి. సెక్యూరిటీ ఇంఛార్జ్​ అధికారుల వివరాలు సైతం బయటపడ్డాయి. కేవలం జిల్లా అధికారులకు మాత్రమే అందించిన.. 49 పేజీల సమగ్రమైన వివరాలు బహిర్గతమయ్యాయి. ఘటనపై ఏడీజీపీ ఇంటెలిజెన్స్ అధికారి టీకే వినోద్ కుమార్ విచారణకు ఆదేశించారు.

కేరళలో మోదీ పర్యటన..
ఏప్రిల్​ 24 నుంచి రెండు రోజుల పాటు కేరళలో ప్రధాన మంత్రి పర్యటిస్తారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఏప్రిల్​ 24న సాయంత్రం.. ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానంలో మధ్యప్రదేశ్​ నుంచి కేరళకు ప్రధాని మోదీ బయలుదేరతారు. దాదాపు 5 గంటల ప్రాంతంలో కొచ్చి ఎయిర్​పోర్ట్​కు చేరుకుంటారు. అనంతరం అక్కడి రోడ్​ షోలో పాల్గొంటారు. ఆ తరువాత బీజేపీ నేతృత్వంలోని యువజన సంఘాలు నిర్వహించే 'యువం' అనే సమావేశంలో పాల్గొంటారు. తేవరా సేక్రెడ్ హార్ట్ కాలేజ్ గ్రౌండ్ ఈ కార్యక్రమం జరుగుతుంది.

కార్యక్రమం ముగిసిన తరువాత.. 7.45 గంటలకు తాజ్ మలబార్ హోటల్​కు చేరుకుని ఆ రాత్రికి మోదీ అక్కడే బస చేస్తారు. తరువాతి రోజు ఉదయం.. 9.25 గంటలకు కొచ్చి ఎయిర్​ పోర్ట్​ నుంచి రాజధాని తిరువనంతపురం బయల్దేరుతారు. దాదాపు 10.15 గంటలకు అక్కడికి చేరుకుంటారు. అనంతరం 10.30 గంటల సమయంలో సెంట్రల్ రైల్వే స్టేషన్​లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. సుమారు 20 నిమిషాల పాటు ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇది ముగిసిన అనంతరం 11 గంటలకు సెంట్రల్​ స్టేడియంలో జరిగే.. బహిరంగ సమావేశంలో మోదీ పాల్గొంటారు. సభ అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు సూరత్‌కు బయలుదేరి వెళతారు.

మోదీ, యోగిని చంపుతామంటూ మెయిల్​..
రెండు వారాల క్రితం.. ఇదే తరహాలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను​ చంపుతానంటూ ఓ అంగంతుకుడు బెదిరించాడు. గుర్తు తెలియని ఆ వ్యక్తి.. ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలో ఉన్న ఓ మీడియా సంస్థకు ఈ మెయిల్​ చేశాడు. దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులుకు సమాచారం అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.