Deaf And Dumb Marriage Jaipur: రాజస్థాన్ జైపుర్‌కు చెందిన రెండు బధిర జంటలు వివాహబంధంలోకి అడుగుపెట్టాయి. ఇద్దరు బధిర సోదరులు.. తమలాగే మూగ, వినికిడి సమస్య ఉన్న అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నారు. జైపుర్‌లోని జగదీశ్ కాలనీలో ఈ వివాహం జరిగింది.
స్నేహితులు, బంధువులు పాల్గొని జంటలకు సహకారం అందించారు. రాజస్థానీ పద్ధతిలో వీరి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిచారు కుటుంబసభ్యులు.
ఖ్వాజీ ఆధ్వర్యంలో..
నలుగురికీ మూగ, వినికిడి సమస్య ఉండటం వల్ల పెళ్లి మంత్రాలు, ఇతర కార్యక్రమాలను ప్రత్యేక పదాలు, సైగలతో పెళ్లి ముగించారు ఖ్వాజీ. వీరికి వివాహం చేయడం కష్టతరంగా అనిపించిందన్నారు ఖ్వాజీ. ఇరువురి ఇష్టప్రకారమే వివాహం జరిపించినట్లు తెలిపారు.
వీరంతా ఇదివరకు ఒకే పాఠశాలకు చెందినవారని వివరించారు. వీరి వివాహానికి 50మందికి పైగా వధూవరుల స్నేహితులు హాజరై సందడి చేశారు.
ఇదీ చూడండి: సొంత చెల్లినే వివాహమాడిన అన్న.. ఎందుకంటే?