ETV Bharat / bharat

మే నెలలో మరణించిన వ్యక్తికి.. డిసెంబర్​లో రెండో డోసు..! - కరోనా వ్యాక్సిన్​

Dead man vaccinated: ఏడు నెలల క్రితం మరణించిన వ్యక్తికి కొవిడ్​-19 రెండో డోసు వేశారు అధికారులు. వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ డౌన్​లోడ్​ చేసుకోవాలని సందేశం పంపారు. చనిపోయిన వ్యక్తి రెండో డోసు తీసుకోవటం ఏంటని ఆలోచిస్తున్నారా? అసాధ్యమైన ఆ విషయాన్ని సుసాధ్యం చేసి చూపించారు మధ్యప్రదేశ్​ బియోరా జిల్లా యంత్రాంగం.

author img

By

Published : Dec 11, 2021, 4:06 PM IST

Dead man vaccinated: కరోనా వ్యాక్సిన్​ తొలి డోసు కూడా తీసుకోని వ్యక్తికి రెండు డోసులు పూర్తయినట్లు మొబైల్​కు సందేశాలు వచ్చిన సంఘటనలు కొద్ది రోజుల కింద వెలుగు చూశాయి. అలాంటి ఓ అరుదైన సంఘటనే మధ్యప్రదేశ్​ రాజ్​గఢ్​ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది..

జిల్లాలోని బియోరా ప్రాంతానికి చెందిన పురుశోత్తం శక్యవార్​(78) అనే వృద్ధుడు ఈ ఏడాది మే నెలలో మరణించారు. ఆయన పేరుపై ఉన్న మొబైల్​కు కొవిన్​ నుంచి డిసెంబర్​ 3వ తేదీన వ్యాక్సిన్​ రెండో డోసు తీసుకున్నట్లు, వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ డౌన్​లోడ్​ చేసుకోవాలని సందేశం అందింది.

"డిసెంబర్​ 3వ తేదీన మొబైల్​కు మెసేజ్​ వచ్చింది. వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ను సైతం డౌన్​లోడ్​ చేశాం. మా తండ్రి గత ఏప్రిల్​ 8న వ్యాక్సిన్​ తొలి డోసు తీసుకున్నారు. ఇందోర్​లో చికిత్స పొందుతూ మే 24న మరణించారు. "

- ఫూల్​ సింగ్​ శక్యవార్​, వృద్ధుడి కుమారుడు.

ఈ అంశంపై జిల్లా టీకా పంపిణీ అధికారి డాక్టర్​ పీఎల్​ భగోరియాను అడగగా.. ఈ విషయంపై తమకు సమాచారం అందినట్లు చెప్పారు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కంప్యూటర్​లో తలెత్తిన లోపంతో అలాంటి మెసేజ్​ వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు. మరోవైపు.. టీకా పంపిణీ ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది ఫోన్​ నంబర్లను తప్పుగా నమోదు చేస్తున్నారని, అది కూడా ఓ కారణం కావొచ్చని తెలిపారు బయోరా బ్లాక్​ మెడికల్​ అధికారి. తప్పు ఎక్కడ జరిగిందనేది త్వరలోనే గుర్తిస్తామన్నారు.

కాంగ్రెస్​ విమర్శలు..

వ్యాక్సిన్​ సందేశంపై కాంగ్రెస్​ ఎమ్మెల్యే రామచంద్ర డాంగి విమర్శలు గుప్పించారు. వ్యాక్సినేషన్​పై తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని, అలాంటి కేసులపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:

రెండో డోసు తీసుకుంటే.. మద్యం సీసాలపై 10శాతం డిస్కౌంట్

సమయం దాటినా రెండో డోసు తీసుకోని వారు 11 కోట్ల పైనే..

కరోనా టీకా రెండో డోసు ఎగ్గొట్టిన వారు 3.86 కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.