Dead Body Taken From Funeral Pyre : చితిలో కాలిపోతున్న కుమార్తె మృతదేహాన్ని బయటకు తీశారు ఆమె తల్లిదండ్రులు. వెంటనే కొంతమేర కాలిన మృతదేహాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తమ కుమార్తెను ఆమె అత్తమామలే చంపారని ఆరోపించారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకే తమ కుమార్తె దహన సంస్కారాలు గురించి తమకు సమాచారం ఇవ్వలేదని వియ్యంకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగింది.
అసలేం జరిగిందంటే?
అలీగఢ్‌లోని ఖైర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన శివాని అనే యువతికి లోకేశ్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. పెళ్లైన నుంచి శివానిని ఆమె అత్తమామలు అదనపు కట్నం, కారు కోసం వేధించేవారు. ఈ క్రమంలో శివాని అకస్మాత్తుగా మరణించింది. వెంటనే శివాని అత్తమామలు ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కుమార్తె మరణవార్త విని శ్మశానానికి చేరుకున్న శివాని తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.
అప్పటికే తమ కుమార్తె మృతదేహం నిప్పులో కాలిపోవడాన్ని గమనించారు. స్థానికుల సాయంతో శివాని మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పుడు అక్కడే ఉన్న శివాని అత్తమామలు పారిపోయారు. కొంతమేర కాలిన మృతదేహాన్ని తీసుకుని శివాని తల్లిదండ్రులు తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వియ్యంకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
'శివాని ఒంటిపై గాయాల ఆనవాళ్లు ఉన్నాయి. శివానిని ఆమె అత్తమామలు గొంతునులిమి హత్య చేసి ఉంటారని అనుమానంగా ఉంది. అందుకే పోలీసులకు శివాని అత్తమామలపై ఫిర్యాదు చేశాం' అని శివాని కుటుంబ సభ్యులు తెలిపారు. శివాని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. శివాని అత్తమామలను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.
భార్యాబిడ్డలను చంపి తానూ ఆత్మహత్య!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన ఓ వైద్యుడు తన భార్య, పిల్లలను చంపేశాడు. అనంతరం వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
మిర్జాపుర్‌కు చెందిన అరుణ్ కుమార్ సింగ్ (45) గత నాలుగేళ్లుగా మోడరన్ రైల్వే ఆస్పత్రిలో కంటి వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అరుణ్ తన భార్య అర్చన (40), కుమారుడు ఆరవ్ (4), కుమార్తె అరిబా (12)తో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అరుణ్ కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అరుణ్ సింగ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
కర్ణిసేన చీఫ్ హత్య- రాష్ట్ర బంద్‌కు పిలుపు- నిందితుల్లో ఒకడు సైనికుడు!
స్నేహితులతో కలిసి సోదరిపై అత్యాచారం- ఆపై కిరాతకంగా హత్య- ఆ విషయంలో నిలదీసినందుకే!